Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020 21: మోహన్ బగాన్‌కు మరో విజయం.. బెంగళూరుకు తొలి ఓటమి!!

ISL 2020-21: David Williams shine ATK Mohun Bagan beat Bengaluru FC

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 2020-21 సీజన్‌లో ఏటికే మోహన్ బగాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుత ఆటతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుని.. పట్టికలో టాప్ పోసిషన్‌లో కొనసాగుతోంది. 16 పాయింట్లతో ముంబై సిటీతో కలిసి పట్టికలో రెండో స్థానంలో ఉంది. సోమవారం బెంగళూరు ఎఫ్‌సీ‌ జట్టుతో జరిగిన మ్యాచులో ఏటికే 1-0తో విజయాన్ని అందుకుంది. ఏటికే తరపున ఆస్ట్రేలియా ఫార్వర్డ్ డేవిడ్ విలియమ్స్ 33వ నిమిషంలో గోల్ చేశాడు. బెంగళూరుకు ఇదే తొలి ఓటమి.

గోవాలోని ఫటోర్డా స్టేడియంలో రాత్రి జరిగిన మ్యాచులో ఏటికే మోహన్ బగాన్, బెంగళూరు ఎఫ్‌సీ‌ రెండు జట్లు ఫేవరేట్లుగా బరిలోకి దిగాయి. స్టార్ ఆటగాళ్లతో నిండిన ఉన్న ఇరు గోల్ కోసం పోటీపడ్డాయి. 33వ నిమిషంలో వచ్చిన అవకాశాన్ని ఏటికే చక్కగా వినియోగించుకుంది. గ్రీన్, మెరూన్‌ల నుంచి బంతి అందుకున్న డేవిడ్ విలియమ్స్.. గోల్‌గా మలిచాడు. దీంతో మొదటి అర్ధభాగంను ఏటికే 1-0తో ముగించింది. రెండో భాగంలో బెంగళూరు ఎంతప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఏటికే విజయాన్ని అందుకుంది.

మంగళవారం జరిగే మ్యాచులో ఒడిశా ఎఫ్‌సీ‌, నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ‌ జట్లు తలపడనున్నాయి. బంబోలిమ్‌లోని జిఎంసి అథ్లెటిక్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవనుంది. ఈ మ్యాచులో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచులలో రెండు విజయాలు, ఒక ఓటమిని చవిచూసింది. ఇక నాలుగు మ్యాచులను డ్రాగా ముగించింది. 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఒడిశా ఆడిన ఆరు మ్యాచులలో ఒక్క విజయాన్ని అందుకోలేదు. ఒక డ్రా, ఐదు పరాజయాలను ఎదుర్కొంది. కేవలం ఒక పాయింట్‌తో చిట్టచివరి (11) స్థానంలో ఉంది.

Story first published: Tuesday, December 22, 2020, 10:50 [IST]
Other articles published on Dec 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+