Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజయాల బాట పట్టించేనా: బంగ్లాదేశ్ కొత్త కోచ్‌ ఎవరో తెలుసా?

Former South Africa coach Russell Domingo appointed Bangladesh head coach

హైదరాబాద్: బంగ్లాదేశ్‌ హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ కోచ్‌ రసెల్‌ డొమినిగో ఎంపికయ్యాడు. స్టీవ్ రాడ్స్ స్థానంలో రసెల్ డొమినిగో రాబోయే రెండేళ్ల పాటు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

ఐదు సిక్సులు, మూడు గుడ్లు... ప్రతీకారాన్ని తీర్చుకునేలా చేశాయి

దీంతో స్టీవ్ రాడ్స్‌ను హెడ్ కోచ్‌గా కొనసాగించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విముఖత చూపించింది. ఈ నేపథ్యంలో బోర్డు కొత్త హెడ్ కోచ్ దరఖాస్తులను ఆహ్వానించింది. టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం రవిశాస్త్రితో పోటీపడి రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్‌ హెసన్‌కు ఇక్కడ నిరాశే ఎదురైంది.

బంగ్లా క్రికెట్ బోర్డు షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో హెసన్‌ ఉన్నప్పటికీ కోచ్‌గా ఎంపిక కాలేదు. అనుభవం దృష్ట్యా డొమినిగోకే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓటేసింది. తన పదవీ కాలాన్ని పీసీబీ పొడిగించకపోవడంతో పాకిస్థాన్ మాజీ కోచ్ మికీ ఆర్ధర్ కూడా బంగ్లా కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అతడిని కూడా పరిగణనలోకి తీసుకోలేదు.

కొత్త కోచ్ ఎంపికపై బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్లా హసన్‌ మాట్లాడుతూ తమ జట్టుకు ఎవరైతే ఎక్కువ అందుబాటులో ఉంటారనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని డొమినిగోని ఎంపిక చేశామని తెలిపారు. డొమినిగో సైతం తనకు ఎటువంటి సెలవులు అవసరం లేదని, జట్టుతో పాటే ఉంటానని డొమినిగో తెలపడం విశేషం.

గతంలో దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్‌గా వ్యవహారించిన డొమినిగో... ఆగస్టు 21వ తేదీ నుంచి బంగ్లాదేశ్‌ జట్టుతో జత కట్టనున్నాడు. డొమినిగో మొదటి అసైన్మెంట్ సెప్టెంబర్ 5న ఆప్ఘనిస్థాన్‌తో ప్రారంభమయ్యే ఏకైక టెస్టు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టు ముక్కోణపు వన్డే సిరిస్ ఆడనుంది.

Story first published: Saturday, August 17, 2019, 17:16 [IST]
Other articles published on Aug 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+