For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడలేకపోయాడు: మాజీ సెలెక్టర్

Former selector Sarandeep Singh reveals why MS Dhoni didn’t get a farewell match

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా గతేడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా వాయిదా పడటంతోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడలేకపోయాడని మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అన్నాడు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ గతేడాది ఆగస్టులో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందర్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. వాస్తవానికి టీ20 ప్రపంచకప్ అందుకొని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తరహాలో ఆటకు సగర్వంగా ధోనీ వీడ్కోలు పలకుతాడని అంతా భావించినా.. ఈ జార్ఖండ్ డైనమైట్ మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు.

టీ20 ప్రపంచకప్ జరుగుంటే..

టీ20 ప్రపంచకప్ జరుగుంటే..

ప్రస్తుతం ఐపీఎల్‌ కొనుసాగుతున్నప్పటికీ.. బీసీసీఐ కూడా మహీ కోసం ఫేర్‌వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయలేదు. అయితే తాజాగా ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ శరణ్ దీప్ సింగ్ ఈ విషయంపై స్పందించాడు. 'గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా వాయిదా పడటంతో ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడలేకపోయాడు. ఆ టోర్నీ వాయిదా పడటంతోనే మహీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ టీ 20 ప్రపంచకప్ గనుక జరుగుంటే.. మహీ కచ్చితంగా ఆ మెగా టోర్నీ ఆడేవాడు. ఘన వీడ్కోలు కూడా అందుకునే వాడు'అని శరణ్ దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.

స్వాతంత్ర్య దినోత్సవం నాడే..

స్వాతంత్ర్య దినోత్సవం నాడే..

భారత స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) రాత్రి 7.29 గంటలకు ధోనీ ఆటకు అల్విదా ప్రకటించాడు. ఎలాంటి ముందస్తు సమాచారం, మీడియా సమావేశం లేకుండా చాలా సింపుల్‌గా ఓ ఇన్‌స్టా పోస్ట్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 'కెరీర్‌ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ కొద్ది సేపటికే ధోనీ బాటలో తాను అంటూ సురేశ్ రైనా సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు.

గోల్డెన్ డకౌట్‌తో ..

గోల్డెన్ డకౌట్‌తో ..

సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004లో బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్ జర్నీ గోల్డెన్ డకౌట్‌తో మొదలైనా.. తర్వాత దేశ క్రికెట్ గతినే మార్చే స్థాయికి ఎదిగింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 17266 రన్స్ చేసిన 38 ఏళ్ల మహీ.. కెరీర్‌లో మొత్తం 350 వన్డేలు, 90 టెస్ట్‌లు, 98 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

829 ఔట్లలో పాలుపంచుకొని వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకడిగా ఇండియా బెస్ట్‌గా వెలుగొందాడు. 2005లో శ్రీలంకతో మహీ తొలి టెస్టు ఆడగా.. 2014లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. 2007లో టీ20 ప్రపంచకప్ సాధించి దేశ క్రికెట్‌కు సరికొత్త బాట చూపిన రాంచీ వీరుడు.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో పాటు చిరకాలం గుర్తుండిపోయే సిక్సర్‌తో 2011 ప్రపంచకప్‌తో యావత్ దేశం ఉప్పొంగేలా చేశాడు.

Story first published: Wednesday, June 30, 2021, 16:32 [IST]
Other articles published on Jun 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+