For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనాతో మాజీ క్రికెటర్​ జడేజా మృతి!

Former Saurashtra Cricketer Rajendrasinh Jadeja Dies Of COVID-19
Saurashtra Cricket Association కి విశిష్ట సేవలు అందించిన Rajendrasinh Jadeja || Oneindia Telugu

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరో మాజీ క్రికెటర్‌ను బలి తీసుకుంది. సౌరాష్ట్రా మాజీ క్రికెటర్, కోచ్, బీసీసీఐ మాజీ రిఫరీ రాజేంద్రసిన్హ్ జడేజా కోవిడ్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్​ ధ్రువీకరించింది. 'సౌరాష్ట్ర క్రికెటర్లలో ఒకరైన రాజేంద్ర సిన్హ్​ జడేజా కరోనా​తో కన్నుమూశారు. పాత తరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న జడేజా లేని లోటు తీరనిది. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాం" అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

పాత తరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్​రౌండర్ జడేజా. 50 ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​ల్లో 134 వికెట్లతో పాటు 1536 రన్స్ సాధించారు. 11 లిస్ట్​-ఏ మ్యాచ్​ల్లో 104 పరుగులతో పాటు 14 వికెట్లు పడగొట్టారు. బీసీసీఐ అధికారిక రిఫరీగా పనిచేశారు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్​లో కోచ్​, టీమ్​ మేనేజర్​, సెలెక్టర్​గా పనిచేశారు. జడేజా మృతి పట్ల బీసీసీఐ, సౌరాష్ట్ర మాజీ కార్యదర్శి నిరంజన్​ షా కూడా సంతాపం ప్రకటించారు.'మంచి క్రికెట్ నైపుణ్యాలున్న ఆటగాడు జడేజా. ఆట పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని పేర్కొన్నారు.

'జడేజా మృతి క్రికెట్ ప్రపంచానికి తీరని లోటు. నేను చూసిన అత్యుత్తమ క్రికెటర్లలో రాజేంద్ర​ సార్ ఒకరు. ఆయన కోచ్​గా ఉన్నప్పుడు నేను క్రికెట్ ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నా'అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్​ అధ్యక్షుడు జై దేవ్​ షా పేర్కొన్నారు.

Story first published: Sunday, May 16, 2021, 17:51 [IST]
Other articles published on May 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+