Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పడు వైఎస్ జగన్.. ఇప్పుడు మంత్రి కేటీఆర్.. రంజీ క్రికెటర్ ‘నకీలీ ఆటలు’

Former Ranji cricketer Arrested For Fraud by Impersonating as KTRs PA

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఓ రంజీ క్రికెట్ ప్లేయర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళానికి చెందిన నాగరాజు అనే ఆంధ్ర మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డి పేరు చెప్పి దందాలు మొదలు పెట్టాడు.

ఫిబ్రవరి 9న కేటీఆర్ సీఎం కాబోతున్నారని, ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేస్తారని కూడా నమ్మించాడు. నాగరాజు అనే నిరుపేద ప్లేయర్ ఇండియా అండర్ 25 టీమ్ వరల్డ్ కప్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్‌లకు సెలెక్ట్ అయ్యడంటూ.. తన గురించే తానే చెప్పుకుంటూ మోసం చేశాడు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల చేతుల మీదుగా కిట్లు అందిస్తామని ప్రైమ్ ఇండియా కంపెనీకి రూ. 3లక్షల టోకరా వేశాడు.

దీంతో పాటు ఫిబ్రవరి 9 న కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని. .ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణస్వీకారం సభలో స్పాన్సర్ షిప్ ఇపిస్తానని మరోసారి మోసానికి యత్నించాడు. నాగరాజు పేరును గూగుల్‌లో సర్చ్ చేసిన కంపెనీ యాజమాన్యం తనో చీటర్ అని తెలుసుకుంది. అతని మాయ మాటలకు తాము మోసపోయామని గ్రహించి హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీకాకుళానికి చెందిన ఏపీ మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

గతంలో వైఎస్ జగన్ పీఏ పేరు..

గతంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్‌) పేరు చెప్పి ఓ సెల్‌ఫోన్‌ విక్రయ కంపెనీని మోసం చేయబోయి పోలీసులకు చిక్కాడు. ఇక నాగరాజుపై విశాఖపట్నం, విజయవాడతో పాటు తెలంగాణలో సైతం మరో నాలుగు కేసులు నమోదైనట్లు తేలింది. గతంలో భారత క్రికెట్‌ జట్టు మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు వాడుకుని డబ్బులు దండుకున్న ఘటనల్లో నాగరాజు అరెస్టు అయినట్లు వెల్లడైంది.

Story first published: Sunday, February 16, 2020, 14:59 [IST]
Other articles published on Feb 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+