13 ఏళ్ల కుర్రాడు.. ఇలా భారీ సిక్సర్ కొట్టగలడా? చోటా సూరీడిపై పాక్ మాజీ క్రికెటర్ డౌట్!
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ వయసుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జునైద్ ఖాన్ సందేహం వ్యక్తం చేశాడు. అండర్ 19 ఆసియాకప్ 2024లో వైభవ్ సూర్యవంశీ సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం చూసి అవాక్కైన ఈ పాక్ ఆటగాడు.. అతనికి 13 ఏళ్ల వయసంటే నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డాడు.
ఎక్స్‌వేదికగా వైభవ్ సూర్యవంశీ కొట్టిన ఓ భారీ సిక్సర్ వీడియోను షేర్ చేసిన జునైద్ ఖాన్..'నిజంగా ఓ 13 ఏళ్ల కుర్రాడు ఇలాంటి భారీ సిక్స్ కొట్టగలడా?' అని ప్రశ్నించాడు. దాంతో వైభవ్ సూర్యవంశీ వయసుపై తీవ్ర చర్చ జరుగుతోంది. సూర్యవంశీ తప్పుడు బర్త్‌డే సర్టిఫికేట్స్‌తో ఏజ్ ఫ్రాడ్ చేసి ఉండొచ్చని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ ఆరోపణలపై సూర్యవంశీ తండ్రి సంజీవ్ స్పందించారు. తన కొడుకు ఎలాంటి ఏజ్ ఫ్రాడ్ చేయలేదని, 8 ఏళ్ల వయసులోనే బీసీసీఐ బోన్ టెస్ట్‌కు హాజరయ్యాడని చెప్పాడు. మరోసారి టెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని సవాల్ విసిరాడు. '8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వైభవ్ సూర్యవంశీకీ బీసీసీఐ బోన్ టెస్ట్ జరిగింది. ఇప్పటికే అతను అండర్ 19 జట్టు తరఫున ఆడాడు. మేం ఎవరికీ భయపడం. మళ్లీ వయసు నిర్దారిత పరీక్ష చేయించుకునేందుకు సూర్య సిద్దం'అని సంజీవ్ తెలిపాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లు పలికి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 6 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులతో అజేయంగా నిలిచిన సూర్య.. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో అదే జోరు కనబర్చాడు.
6 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67 పరుగులతో సత్తా చాటాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో మాత్రం వైభవ్ సూర్యవంశీ దారుణంగా విఫలమయ్యాడు. 9 పరుగులే చేసి వెనుదిరిగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది.
Can a 13-year-old kid really hit such a long six????
— Junaid khan (@JunaidkhanREAL) December 7, 2024
🤦🏻♀️🤦🏻♂️🤦🏻♀️🤦🏻♂️ #INDvsAUS #AUSvIND #ChampionsTrophy2025 #SAvSL pic.twitter.com/KaQNxBGCNO
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications