Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Rankings: 8 నెలల నుంచి ఆడకున్నా.. బాబర్ ఆజామ్‌కు అగ్ర స్థానమా? : పాక్ మాజీ క్రికెటర్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించే ర్యాంకులపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు ఈ ర్యాంకులను ఎలా ఇస్తున్నారని ప్రశ్నించాడు. 8 నెలల నుంచి వన్డే క్రికెట్‌కు దూరంగా ఉన్న బాబర్ ఆజామ్‌ అగ్రస్థానంలో ఎలా కొనసాగుతున్నాడని విస్మయం వ్యక్తం చేశాడు. ఇటీవల ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజామ్ టాప్‌లో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.

శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఐసీసీ ర్యాంకింగ్స్‌పై స్పందించిన బసిత్ అలీ పలు ప్రశ్నలు సంధించాడు. 'ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల విభాగం చూసి కాస్త ఆశ్చర్యానికి గురయ్యాను. బాబర్ ఆజామ్ టాప్‌లో ఉండగా.. రోహిత్ శ ర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Former Pakistan star Basit Ali lashes out at ICC Rankings doubts Babar Azam s no 1 spot

ఇతర పేర్లను చదవాల్సిన అవసరం లేదనిపించింది. ఈ ర్యాంకులను చూస్తుంటే బాబర్ ఆజామ్ ఆడకపోయినా... అగ్రస్థానంలో ఉన్నట్లు అనిపించింది. వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకర్‌గా ఉన్నందుకు బాబర్ ఆజామ్ సంతోషపడుతాడు. అసలు ఇలాంటి ర్యాంకులు ఇచ్చిందెవరు? ఏ లెక్కన ప్రకారం బాబర్ ఆజామ్ శుభ్‌మన్ గిల్ టాప్-3లో నిలిచారు.

బాబర్ ఆజామ్ తన చివరి వన్డేను గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. అప్పటి నుంచి మళ్లీ వన్డే మ్యాచ్ ఆడలేదు. అయినా అతని ర్యాంక్ మాత్రం అలానే ఉంది. ఇక భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఇటీవల శ్రీలంకతో ఆడాడు. గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. మరోవైపు గత వన్డే ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్ర, క్వింటన్ డికాక్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడటంతో పాటు సెంచరీలు నమోదు చేశారు.

పాకిస్థాన్ నుంచి రిజ్వాన్, ఫఖర్ జమాన్‌లు మాత్రమే శతకాలు సాధించారు. కానీ ర్యాంకుల్లో బాబర్, శుభ్‌మన్ గిల్‌లో టాప్‌లో కొనసాగుతున్నారు. ఈ ర్యాంకుల విధానమే సరిగ్గా లేదనిపిస్తోంది.'అని బసిత్ అలీ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ ముందు జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ల్లో శుభ్‌మన్ గిల్, బాబర్ ఆజామ్ పరుగుల మోత మోగించారు. దాంతోనే వారు పెద్దగా రాణించకపోయినా.. ఎక్కువ రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

వన్డే ప్రపంచకప్ తర్వాత పెద్దగా వన్డే సిరీస్‌లు జరగలేదు. టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో అన్నీ జట్లు పొట్టి ఫార్మాట్‌పైనే ఫోకస్ పెట్టాయి. దాంతో వారి ర్యాంకులు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి.

Story first published: Friday, August 16, 2024, 13:25 [IST]
Other articles published on Aug 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+