Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీకి కనీస గౌరవం ఇవ్వలేదు.. బీసీసీఐపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఫైర్!

Former Pakistan spinner Danish Kaneria Slams BCCI for Virat Kohlis Removal as ODI Captain

న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయంలో యావత్ క్రికెట్ ప్రపంచం రెండుగా విడిపోయింది. కొందరూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరూ తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా బీసీసీఐ తీరును తప్పుబట్టాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ అంశంపై మాట్లాడుతూ బీసీసీఐ తీరును తప్పుబట్టాడు. టీమిండియా సూపర్ స్టార్ అయిన విరాట్ కోహ్లీకి బీసీసీఐ కనీస మర్యాద ఇవ్వలేదని, అతన్ని మరింత హుందాగా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

 అతని రికార్డ్స్ కన్నా గౌరవం ఇవ్వాలి..

అతని రికార్డ్స్ కన్నా గౌరవం ఇవ్వాలి..

'విరాట్ కోహ్లీ‌ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం కరెక్టేనా? కాదా? అనే చర్చ నేను చేయడం లేదు. కానీ అతన్ని హుందాగా తప్పించాల్సిందని చెబుతున్నా. అతను భారత్‌కు 65 విజయాలు అందించాడు. అత్యధిక విజయాలందించిన భారత కెప్టెన్లలో అతను నాలుగోవాడు. అంత మంచి రికార్డు ఉన్న కోహ్లీని ఒప్పించకుండా ఇలా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం సరికాదు. అంతేకాకుండా అత్యధిక పరుగులు చేసిన భారత రెండో కెప్టెన్ కూడా అతే. అతని రికార్డ్స్‌కు అయినా కనీస గౌరవం ఇవ్వాల్సిందే. విరాట్ తన సారథ్యంలో ఐసీసీ ట్రోఫీ గెలవలేదనేది వాస్తవమే. కానీ అతని కెప్టెన్సీ అసాధారణం అనే విషయం మరవద్దు.

పరుగులు చేయకపోవడంతోనే..

పరుగులు చేయకపోవడంతోనే..

ఈ తరం క్రికెట్‌లో ఇద్దరే సూపర్ స్టార్లు. అందులో ఒకరు విరాట్ కోహ్లీ అయితే మరొకరు బాబర్ ఆజామ్. సూపర్ స్టార్‌లను గౌరవించడం మన కనీస బాధ్యత. కోహ్లీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి అతని పట్ల కఠినంగా ప్రవర్తించింది. సౌరవ్ గంగూలీ వంటి పెద్ద వ్యక్తి కోహ్లీతో మాట్లాడి రోహిత్ శర్మను కెప్టెన్ చేస్తున్నామనే విషయాన్ని చెప్పాల్సింది. అయితే ఇటీవల కాలంలో కోహ్లీ పరుగులు చేయకపోవడం కూడా అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడానికి ఓ కారణమైంది.'అని కనేరియా చెప్పుకొచ్చాడు.

కోహ్లీనే వినలేదు..

కోహ్లీనే వినలేదు..

టీ20 ఫార్మాట్ సారథ్యాన్ని వదులుకోవద్దని తాము ఎంత రిక్వెస్ట్ చేసినా విరాట్ కోహ్లీ వినలేదని సౌరవ్ గంగూలీ పేర్కొన్న విషయం తెలిసిందే. 'విరాట్ స్థానంలో రోహిత్‌కు కెప్టెన్సీ ఇవ్వడమనేది బోర్డు సెలెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయం. నిజానికి టీ20 కెప్టెన్సీ వదులుకవద్దని విరాట్‌ను మేం చాలా రిక్వెస్ట్ చేశాం. కానీ కోహ్లీ మా మాటకు ఒప్పుకోలేదు.

దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లు ఉండటం సరికాదని సెలెక్టర్లు భావించారు. వన్డే, టీ20లకు వేర్వేరు లీడర్లు ఉండటం కన్ఫ్యూజన్‌కు దారి తీస్తుందనుకున్నారు. అందుకే ఒకే కెప్టెన్ ఉంటే మంచిదని.. రోహిత్‌ను కెప్టెన్ చేశారు. టెస్ట్ జట్టుకు విరాట్ కెప్టెన్‌గా కొనసాగుతాడు. ఈ విషయాలపై బోర్డు ప్రెసిడెంట్‌గా నేను, సెలెక్షన్ కమిటీ చైర్మన్ కూడా కోహ్లీతో పర్సనల్‌గా మాట్లాడాం. పూర్తి వివరాలు చెప్పలేను గానీ రోహిత్‌ను వైట్ బాల్ కెప్టెన్ చేయడానికి ప్రధాన కారణం మాత్రం ఇదే. అందుకు విరాట్ కూడా ఒప్పుకున్నాడు.'అని దాదా చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, December 11, 2021, 14:03 [IST]
Other articles published on Dec 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+