Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌కు డబ్బులు అవసరం లేదన్న కపిల్ వ్యాఖ్యలపై అఫ్రిది ఫైర్

Former Pakistan Cricketer Shahid Afridi not pleased with Kapil Dev’s India has enough money comment

‌ఇస్లామాబాద్: కరోనా విరాళాల కోసం భారత్-పాకిస్థాన్ సిరీస్ నిర్వహించాలని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే.
డబ్బుల కోసం క్రికెటర్ల ప్రాణాలు పనంగా పెట్టాల్సిన కర్మ భారత్‌కు పట్టలేదని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. అక్తర్ కామెంట్స్ చాలా కామెడీగా ఉన్నాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కొట్టిపారేశాడు.

ఇక భారత్‌‌లో డబ్బుందని, ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి తమ అధికారులు చేయాల్సిన పని చేస్తున్నారని కపిల్ చేసిన కామెంట్స్‌పై అక్తర్ కూడా స్పందించాడు. కపిల్ భాయ్ అంటే తనకు గౌరవం ఉందని, అయితే తన ప్రతిపాదనను అతను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం మొత్తానికి డబ్బులు అవసరమున్నాయని తెలిపాడు. త్వరలోనే తన ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందని ఆశాభావం కూడా వ్యక్తం చేశాడు.

అయితే తాజాగా కపిల్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ కూడా స్పందించాడు. అక్తర్‌ను వెనుకెసుకొస్తూ కపిల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. అక్తర్ మానవత్వంతో తనకు తోచిన సలహా ఇస్తే.. అతనిపై కపిల్ దేవ్ విరుచుకుపడటం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. భారత్‌‌లో డబ్బుంటే.. కొందరు చెత్త కుప్పల్లోని ఆహారాన్ని ఎందుకు తింటున్నారని ప్రశ్నించాడు.

పాక్ ప్యాషన్ అనే చానెల్‌తో మాట్లాడుతూ.. కపిల్ వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చాడు. 'మానవత్వం కోసం షోయబ్ అక్తర్ సానుకూలంగా ఓ ప్రతిపాదన చేశాడు. అతని సూచనలపై బదులిస్తూ కపిల్ చేసిన వ్యాఖ్యలు నన్ను షాక్‌కు గురిచేశాయి. భారత్‌లో కొందరు చెత్త కుప్పుల్లోని ఆహారం తింటున్న వీడియోలను నేను చూశాను. కపిల్ అంటే నాకు గౌరవం ఉది. ఇప్పటికి అతనేం సాయం చేశాడో చెప్పలేదు.'అని అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Story first published: Monday, April 13, 2020, 21:51 [IST]
Other articles published on Apr 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+