
'ఆసియా కప్‌ను ఈ ఏడాది రద్దు చేయాలా? లేక నిర్వహించాలా? అనే విషయాన్ని నిర్ణయించాల్సింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. కానీ సౌరవ్ గంగూలీ అనవసరమైన తన పవర్ చూపించడం ద్వారా ఆసియా క్రికెట్ దేశాల్ని బాధపెట్టాడు. అతను భారత క్రికెట్, ఐపీఎల్‌పై శ్రద్ధ పెడితే మంచిది'అని రషీద్ లతీఫ్ ఘాటుగా ట్వీట్ చేశాడు.
ఇక కరోనా నేపథ్యంలో సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియాకప్ 2020 టోర్నీ రద్దయిందని బుధవారం సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. 'ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ తొలుత ఏ సిరీస్ ఆడుతుందని చెప్పడం కష్టం. కరోనా వైరస్ ఎప్పుడు అంతం అవుతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మనం వేచి చూడక తప్పదు. ఇప్పటికే స్టేడియాలు ఓపెన్ అయినా వైరస్ భయంతో క్రికెటర్లు వెళ్లడం లేదు. కాబట్టి భారత్‌లో క్రికెట్ రీస్టార్ట్ విషయంలో మాకు తొందరలేదు. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియాకప్ రద్దయింది. కాబట్టి భారత్‌లో క్రికెట్ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేం'అని దాదా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఇక గురువారం ఏసీసీ ఆసియాకప్ వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఏసీసీ తమ ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఏడాది జూన్‌లో శ్రీలంక వేదికగా ఈ టోర్నీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.