రాముడిని, మోదీని తిట్టడమే నిరసనా: పాక్ మాజీ క్రికెటర్
దేశరాజధాని న్యూఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసనలను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తప్పుబట్టాడు. భారత్‌లో శ్రీరాముడిని, ప్రధాని నరేంద్ర మోదీని దూషించడమే ప్రతి నిరసన వెనుక ఉన్న అసలు ఉద్దేశమని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా భారత్‌లో ప్రతీ నిరసన వెనుక స్క్రిప్ట్ ఉంటుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.
'భారత్‌లో ఇప్పుడు ప్రతి నిరసనకు ఒకటే స్క్రిప్ట్. భారత మాతను, ప్రధాని మోదీని, ఆయన తల్లిని, బ్రాహ్మణులను, శ్రీరాముడిని దూషించడం, హిందూత్వంపై స్లోగన్‌లు ఇవ్వడమే నిరసనలుగా భావిస్తున్నారు. ఇక్కడ కూడా నేపాల్‌లో వచ్చిన పరిస్థితులు వస్తాయని ప్రతిపక్ష పార్టీలు కాచుకొని కూర్చున్నాయి.
అమెరికాతో ట్రేడ్ డీల్ జరగకముందే.. కొందరు రైతులు ఢిల్లీని బ్లాక్ చేయాలని సిద్దమైపోయారు. ఇదంతా సర్కస్‌లా మారుతుంది. నిజాలు తెలుసుకోకుండా నిరసనలు తెలుపుతూ ఉంటే ఇక దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది.'అని కనేరియా ప్రశ్నించాడు.

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై డానిష్ కనేరియా మరో వీడియోను కూడా పోస్ట్ చేశారు. శాంతియుత నిరసనల పేరుతో కొందరు కత్తులు తీసుకువచ్చారంటూ ఆయన మండిపడ్డారు. పోలీసులపై కత్తులతో దాడులు చేసేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలని డానిష్ కనేరియా సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారింది.
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలని కాక్రోచ్ జనతా పార్టీ, వేలాది మంది విద్యార్థులు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే పార్లమెంట్‌వైపు దూసుకెళ్లిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. దాంతో ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నిరసనలకు కాంగ్రెస్ కూడా తన మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలు నిరసనల్లో పాల్గొంటున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

