Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ: పాక్ మాజీ క్రికెటర్ వార్నింగ్

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను బలవంతంగా జట్టు నుంచి తప్పించడం సరికాదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ అన్నాడు. కేవలం రెండు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా ఐకాన్ ప్లేయర్‌ను తప్పించడం టీమిండియాకు తీరని నష్టం చేస్తుందని హెచ్చరించాడు. రోహిత్ రిటైర్మెంట్.. విరాట్ కోహ్లీని తప్పుకునేలా చేస్తుందని అభిప్రాయపడ్డాడు.

ఈ ప్రపంచం ఇంకా విరాట్ కోహ్లీ ఆటను చూడాలనుకుంటుందని, రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై పునరాలోచన చేయాలని బసిత్ అలీ సూచించాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 11, 26 పరుగులతో విఫలమయ్యాడు. దాంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు తెరపైకి వచ్చాయి. వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల నుంచి తొలగించామని భారత సెలెక్టర్లు రోహిత్ శర్మకు సమాచారమిచ్చారని, భవిష్యత్తు తేల్చుకోవాలని సూచించారని వార్తలు వచ్చాయి. ఇవీ ఊహగానాలేనని బీసీసీఐ కొట్టిపారేసింది. అయినా రిటైర్మెంట్ వార్తలు ఆగడం లేదు.

Former Pakistan cricketer Basit Ali Warns Rohit Sharma s retirement may force Virat Kohli to exit

కోహ్లీపై ప్రభావం..

ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన బసిత్ అలీ.. భారత క్రికెట్‌కు తీరని నష్టం జరుగుతుందని బీసీసీఐని హెచ్చరించాడు. జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకునేలా రోహిత్ ప్రదర్శన ఉన్నంత కాలం అతన్ని కొనసాగించాలని సూచించాడు. కేవలం రెండు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా అతన్ని అంచనా వేయడం సరికాదన్నాడు. రోహిత్‌పై ఒత్తిడి విరాట్ కోహ్లీ భవితవ్యాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరించాడు.

'రోహిత్ మెరుగ్గా ఆడుతున్నంత కాలం అతన్ని జట్టులో కొనసాగించాలి. కేవలం ఇంగ్లండ్‌లో రెండు వన్డేల ప్రదర్శన ఆధారంగానో లేక గంభీర్ ఇష్టా,అయిష్టాలతోనే అతన్ని అంచనా వేయాలనుకుంటే.. విరాట్ కోహ్లీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

అది ఘోర తప్పిదం..

ఈ రోజు రోహిత్ వంతు అయితే.. వచ్చేసారి విరాట్ కోహ్లీ వంతు కావచ్చు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తీరును బట్టి చూస్తే.. లార్డ్స్‌ వన్డేలో వారిద్దరూ తమ రిటైర్మెంట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. వారిపై మరీ ఎక్కువ ఒత్తిడి తెస్తే.. అలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని నేను భావిస్తున్నా. అప్పుడు అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే క్రికెట్ ప్రపంచం ఇప్పటికీ విరాట్ కోహ్లీ ఆటను చూడాలని కోరుకుంటుంది.'అని బాసిత్ అలీ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ కూడా ఇప్పటికే తన గౌరవానికి భంగం కలిగినా.. తనను తాను నిరూపించుకునే పరిస్థితి వచ్చినా వెంటనే క్రికెట్ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయితే కోహ్లీపై అనవసర ఒత్తిడి నెలకొంటుంది. అప్పుడు కోహ్లీ కూడా వీడ్కోలు పలికే ప్రమాదం ఉందని విశ్లేషకులు బీసీసీఐని హెచ్చరిస్తున్నారు.

Story first published: Saturday, July 18, 2026, 13:11 [IST]
Other articles published on Jul 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+