T20 World Cup:పాక్ జట్టులో అతడిని చూడడం సంతోషంగా ఉంది.. కప్ తీసుకురావడంలో సాయపడతాడు: అఫ్రిది

ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్ 2021 కోసం గత నెలలో ప్రకటించిన పాకిస్తాన్ జట్టులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా మార్పులను చేసింది. గతంలో ప్రకటించిన మహ్మద్ హస్నేన్, అజమ్ ఖాన్ స్థానాల్లో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీలను తుది 15 మంది జట్టులోకి తీసుకుంది. రిజర్వ్ ఆటగాళ్లలో ఫఖర్ జమాన్ బదులుగా ఖుష్దిల్ షాను ఎంపికచేసింది.
ఇక మిడిలార్డర్ బ్యాటర్ షోయబ్ మక్సూద్ గాయంతో తప్పుకోవడంతో.. 39 ఏళ్ల వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను తుది జట్టులోకి పీసీబీ ఎంపిక చేసింది. అక్టోబర్ 10 వరకు ఇదివరకు ప్రకటించిన తుది జట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పేర్కొన్న నేపథ్యంలో పీసీబీ మరోసారి తుది జట్టును ప్రకటించింది.

జట్టును ముందుండి నడిపిస్తాడు
షోయబ్ మాలిక్‌ను మళ్లీ టీ20 ప్రపంచకప్ 2021 జట్టులో చూడటం బాగుందని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆనందం వ్యక్తం చేశాడు. మాలిక్ లాంటి అనుభవజ్ఞుడు జట్టుతో కలిసి ఉండటం ఎంతో లాభిస్తుందన్నాడు. ఈ మేరకు షాహిద్ అఫ్రిది వరుస ట్వీట్లు చేశాడు. 'షోయబ్ మాలిక్‌ను మళ్లీ పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ జట్టులో చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మంచి నిర్ణయం తీసుకుంది. పీసీబీకి ధన్యవాదాలు. మాలిక్ లాంటి అనుభవజ్ఞుడు జట్టుతో కలిసి ఉండటం మంచిదే. తన సీనియారిటీతో జట్టును ముందుండి నడిపిస్తాడు' అని అఫ్రిది తన ట్వీటులో ఆశాభావం వ్యక్తం చేశాడు. మాలిక్‌కు ఇది ఆరో టీ20 ప్రపంచకప్ కావడం విశేషం.

గాయం రూపంలో అదృష్టం వరించింది
'టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీకి వెళ్లే పాకిస్తాన్ ఆటగాళ్లందరి కోసం నేను మనసారా ప్రార్థిస్తున్నా. నా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు బాగా ఆడి జట్టును విజేతగా నిలపండి. మమ్మల్ని అందర్నీ గర్వపడేలా చేస్తారని ఆశిస్తున్నా' అని షాహిద్ అఫ్రిది మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు. షోయబ్ మాలిక్ 2007లో అరంగేట్రం టీ20 ప్రపంచకప్ నుంచీ పాక్ జట్టుతో కొనసాగుతున్నాడు. తొలి టోర్నీలోనే పాకిస్థాన్‌కు సారథ్యం వహించి.. జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇక 2009లో పాక్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2010 టోర్నీలో ఆడలేకపోయిన మాలిక్.. గత మూడు టోర్నీల్లోనూ పాక్ తరఫున ఆడాడు. ఇప్పుడు మరోసారి టీ20 ప్రపంచకప్‌లో అతడు ఆడబోతున్నాడు. గాయం రూపంలో మాలిక్‌కు అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి.
IPL 2021: అందుకే సన్‌రైజర్స్ హైదరాబాద్ వీడ్కోలు వీడియోలో లేను: డేవిడ్ వార్నర్

అక్టోబర్ 24న హై ఓల్టేజ్ మ్యాచ్
మరో వారం రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2021 ఆరంభం కానుంది. ఒమన్, యూఏఈలో జరగనున్న మెగా టోర్నీ కోసం యునైటెడ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అక్టోబర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 23న సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు తలపడనున్నాయి. దాంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది.
పాకిస్థాన్ టీ20 జట్టు
బాబర్ అజామ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరిస్ రఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ వసీమ్ జూ, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, షోయబ్ మాలిక్.
రిజర్వ్ ఆటగాళ్లు: ఖుష్దిల్ షా, షహ్నవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications