Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రవిశాస్త్రిని మించిన కోచ్ లేడు: పాక్ మాజీ క్రికెటర్

Former Pakistan batsman’s huge praise for India coach Ravi Shastri

కరాచీ: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసల జల్లు కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్న కోచ్‌లలో రవిశాస్త్రిని మించినవారు లేరని కొనియాడాడు. భారత జట్టును ఎలా హ్యాండిల్‌ చేయాలో రవిశాస్త్రికి బాగా తెలుసని, ప్రధానంగా స్టార్‌ ఆటగాళ్లకు ఎలా దిశానిర్దేశం చేయాలో రవిశాస్త్రికి ఎవరూ చెప్పనక్కర్లేదన్నాడు.

తన యూట్యూబ్ వీడియో చానెల్‌‌లో మాట్లాడుతూ.. ప్రస్తుత తరంలో రవిశాస్త్రికి కోచ్‌గా తొలిస్థానం ఇస్తానని తెలిపాడు. ఒకవేళ జింబాబ్వే దిగ్గజ ఆటగాడు ఆండ్రీ ఫ్లవర్‌ కోచ్‌గా ఉండి ఉంటే తన ఓటు అతనికే వేసేవాడినని, ఇప్పుడు ఫ్లవర్‌ కోచ్‌గా లేడు కాబట్టి ఆ స్థానం రవిశాస్త్రిదేనన్నాడు.

'రవిశాస్త్రి దిగ్గజ ఆటగాడు. అందులో సందేహం లేదు. ఒక ఆటగాడిగా ఎలా సక్సెస్‌ అయ్యాడో కోచ్‌గా కూడా రవిశాస్త్రి అదే బాటలో నడుస్తున్నాడు. అతని మీడియా సమావేశం ఒకటి నేను చూశా. మీడియాకు ఇచ్చే సమాధానంలో చాలా ముక్కుసూటితనం కనిపించింది. కోచ్‌గా చేసే వ్యక్తికి ఎప్పుడూ అవతలి వ్యక్తికి అడిగిన ప్రశ్నకు తెలివిగా కౌంటర్‌ ఇవ్వాలి. అది రవిశాస్త్రికి బాగా తెలుసనే విషయం ఆ కాన్ఫరెన్స్‌తో గ్రహించా. జట్టును పటిష్టంగా తీర్చిదిద్దాడు. రవిశాస్త్రి చేసే జాబ్‌ అంత ఈజీ కాదు. పెద్ద ఆటగాళ్లను హ్యాండిల్‌ చేయడం చాలా కష్టం. అది రవిశాస్త్రికి బాగా తెలుసు. మా జట్టులో షోయబ్‌ అక్తర్‌ను హ్యాండిల్‌ చేసే కోచ్‌ లేకపోయాడు. అక్తర్‌ పెద్ద ఆటగాడు అనే కారణంతో కోచ్‌లు చూసి చూడనట్లు వదిలేసేవారు. పెద్ద ఆటగాడైనా, చిన్న ఆటగాడైనా వారిని సమన్వయం చేయడం చాలా ముఖ్యం'అని బాసిత్‌ అలీ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, June 26, 2020, 22:35 [IST]
Other articles published on Jun 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+