ఆటకు గుడ్‌బై చెప్పిన కేకేఆర్ మాజీ ప్లేయర్!

లండన్: కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ ప్లేయర్, ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ గార్నీ అంతర్జాతీయ క్రికెట్‌తో సహా అన్ని రకాల ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు. 2014లో స్కాట్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన గార్నీ.. కెరీర్ మొత్తం గాయాలతో సతమతమయ్యాడు. ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతూనే ఆటకు గుడ్‌బై చెప్పాడు. లెఫ్టార్మ్ పేసర్ అయిన హ్యారీ గార్నీ ఇంగ్లండ్ తరపున 10 వన్డేలు, 2 టీ20లు మాత్రమే ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి మొత్తం 14 వికెట్లు తీశాడు.
614 వికెట్లు..
కానీ దేశవాళీ క్రికెట్‌లో గార్నీ దుమ్మురేపాడు. నాటింగ్‌హమ్‌షైర్ తరపున 103 ఫస్ట్‌క్లాస్, 93 లిస్ట్ ఏ, 156 టీ20 మ్యాచ్‌లాడి మొత్తంగా 614 వికెట్లు తీసుకున్నాడు. టీ20 బ్లాస్ట్ టోర్నీలో నాటింగ్ హోమ్‌షైర్ మూడు సార్లు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన గార్నీ.. 8 మ్యాచ్‌లాడి 7 వికెట్లు తీశాడు. అయితే నిలకడైన ప్రదర్శన కనబర్చకపోవడంతో అతని ఐపీఎల్ ప్రస్థానం ఆ సీజన్‌కు మాత్రమే పరిమితమైంది.

రోహిత్ శర్మ ఫైర్..
ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో రోహిత్ శర్మను వికెట్ల ముందు బోల్తాకొట్టించి డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ నిర్ణయంపై సమీక్షకు వెళ్లిన రోహిత్ శర్మ భంగపడ్డాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన హిట్ మ్యాన్ ఆన్ ఫీల్డ్ అంపైర్‌పై పరుషపదజాలం వాడటంతో పాటు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను బ్యాట్‌తో కొట్టాడు. అప్పట్లో ఇది తీవ్ర దుమారం రేపింది. రోహిత్ శర్మ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత కూడా విధించారు.

ఆడే ఓపిక లేదు..
ఇక తనకు ఆడే ఓపిక లేదని, 24 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో గాయాల చాలా వేధించాయని గార్నీ చెప్పుకొచ్చాడు. 'నా రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం. 24 ఏళ్ల నా ఫస్టక్లాస్ కెరీర్‌లో గాయాలు చాలా ఇబ్బందులు పెట్టాయి. చివరకు గుడ్‌బై చెప్పే సమయంలోనూ భుజం గాయంతో బాధపడుతున్నా. అందుకే ఇక ఆడే ఓపిక లేకనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. కానీ ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నాటింగ్‌హమ్‌షేర్‌ను మాత్రం వదల్లేదు. వీటితో పాటు ఇంగ్లండ్‌కు ఆడడం.. ఐపీఎల్, బిగ్‌బాష్, సీపీఎల్ లాంటి మేజర్ టోర్నీలో పాల్గొనడం కూడా గర్వంగా ఫీలవుతున్నా. రిటైర్మెంట్ అనంతరం నేను బిజినెస్‌మన్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నా. చివరగా నా భార్య అవ్రిల్‌కు కృతజ్థతలు.. కష్టకాలంలో తాను నాకు తోడుగా నిలబడింది.. నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు నేనే అదృష్టవంతుడిని'' అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications