ఆ కారణంగానే ధోనీ రిటైరయ్యాడు: మాజీ సెలక్టర్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ అంతరాయం కలిగించకుండా ఉండింటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టీ20 ప్రపంచకప్ ఖచ్చితంగా ఆడేవాడని మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అన్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ 2022కి వాయిదా పడిన విషయం తెలిసిందే.

చెప్పా పెట్టకుండా..
ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిగా భారత్ తరఫున బరిలోకి దిగిన ధోనీ.. ఆ తర్వాత జట్టుకు పూర్తిగా దూరంగా ఉండిపోయాడు. దాంతో.. అతని రిటైర్మెంట్, పునరాగమనంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ధోనీ మాత్రం మౌనంగానే ఉండిపోయాడు. దాంతో టీ20 వరల్డ్‌కప్ ఆడి ఘనంగా వీడ్కోలు పలుకుతాడని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా గత ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ జార్ఖండ్ డైనమైట్ గుడ్ బై చెప్పేశాడు.

ఏనాడు డుమ్మా కొట్టలేదు..
కరోనా లేకుండా షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచకప్ జరిగి ఉంటే ధోనీ ఖచ్చితంగా ఆడేవాడని మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అభిప్రాయపడ్డాడు. 'కరోనా వైరస్ అంతరాయం కలిగించకుండా ఉండింటే..? ధోనీ టీ20 వరల్డ్‌కప్‌లో కచ్చితంగా ఆడేవాడు. మెరుగైన ఫిట్‌నెస్‌తో ఉన్న అతను టీ20 వరల్డ్‌కప్ ఆడలేకపోవడానికి కారణాలేమీ మాకు కనిపించలేదు. ధోనీ కెరీర్‌లో ఎప్పుడూ కూడా ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టలేదు. కొన్ని సందర్భాల్లో ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ ఉన్నప్పటికీ.. సెషన్‌లో ధోనీ కనిపించేవాడు. అందుకే.. గాయాల కారణంగా అతను మ్యాచ్‌లకు దూరమవడం చాలా అరుదు. అందుకే.. ధోనీ అంటే అందరికీ గౌరవం'అని శరణ్‌దీప్ సింగ్ వెల్లడించాడు.

ధోనీ గెలవని ట్రోఫీ అంటూ లేదు..
ఇక విజయవంతమైన కెప్టెన్ అని, అతను గెలవని ట్రోఫీ లేదని శరణ్ దీప్ కొనియాడాడు. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు అన్ని అర్హతలు అతనికి ఉన్నాయన్నాడు. 'టీ20 ప్రపంచకప్ ఆడేందుకు అతను అన్ని విధాల అర్హుడని సెలెక్షన్ కమీటీ ఎప్పుడూ భావించేది. అతను జట్టుకు ఎంతో సేవ చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను గెలవని ట్రోఫీనే లేదు. నాతో సహా సెలెక్షన్ కమిటీలోని ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే.

రిటైర్మెంట్ ప్రకటించినా..
యువ ఆటగాళ్లకు ఏం సూచనలిస్తావని నేను పదే పదే అడిగేవాడిని. అతను మాత్రం ఎక్కువగా ఆలోచించకుండా గేమ్ యొక్క పరిస్థితులను అర్థం చేసుకోమని చెప్పెవాడినని తెలిపేవాడు.'అని శరణ్‌దీప్ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ మ్యాచ్‌లు ఆడాడు. అయితే.. మునుపటి తరహాలో అతని ఇన్నింగ్స్‌లో మాత్రం దూకుడు కనిపించలేదు. కానీ.. వికెట్ కీపర్‌గా మాత్రం అదరగొట్టేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications