For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిన్న జట్ల మీద ఆడటం కాదు.. శ్రేయస్ అయ్యర్‌కు అప్పుడే అసలైన సవాల్: మాజీ చీఫ్ సెలక్టర్

Former Indian Selector Saba Karim Says Shreyas Iyer Has “Bigger Challenges Ahead”

న్యూఢిల్లీ: టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌‌పై మాజీ చీఫ్ సెలెక్టర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో చెలరేగిన శ్రేయస్‌ను ఓవైపు కొనియాడుతూనే మరోవైపు అసలైన సవాల్ ముందుందని హెచ్చరించాడు. బలహీనమైన బౌలింగ్ లైనప్ కలిగిన శ్రీలంకపై ఆడటం సులువేనని, కానీ అసలు సిసలు టీమ్ ఎదురైనప్పుడు కూడా శ్రేయస్ చెలరేగాలన్నాడు.
శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకోవడంలో శ్రేయస్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ ఆట తీరును సబా కరీం కొనియాడాడు.

'శ్రేయస్‌ అయ్యర్‌ తనలోని ఆటను మరింత మెరుగుపరుచుకుని తిరిగి వచ్చాడు. ఒకసారి అతని ఆటను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇప్పుడు అంతా సూర్యకుమార్‌ యాదవ్‌ను 360 డిగ్రీల ఆటగాడు అని పిలుస్తున్నాం. అయితే శ్రీలంకతో మ్యాచ్‌లను చూస్తే శ్రేయస్‌ అయ్యర్‌లో కనిపించింది. ఎక్కడి నుంచైనా పరుగులను రాబట్టగలడు. శ్రేయస్‌ అయ్యర్‌ రన్స్‌ కోసం ప్రత్యేకంగా టెంప్లేట్స్ రూపొందించుకున్నాడు. అసలైన సవాల్‌ ఎప్పుడంటే.. నాణ్యమైన బౌలింగ్‌ దాడి ఎదురైనప్పుడు పరుగులు చేయగలగాలి. శ్రీలంక ప్రస్తుతం బలహీనమైన జట్టు.. అనుభవలేమి బౌలర్లు ఉన్నారు. అందుకే పెద్ద జట్లతో ఆడేటప్పుడే పెద్ద ఛాలెంజ్‌లు ఎదురవుతాయి'అని సబా కరీం తెలిపాడు.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు అసలు సిసలు సమరానికి సిద్దమైంది. వన్డే, టీ20 కెప్టెన్‌గా సత్తా చాటిన రోహిత్ శర్మ.. శుక్రవారం నుంచి శ్రీలంకతో జరగనున్న తొలి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి జట్టును నడిపించనున్నాడు. ఈ మ్యాచ్‌తో టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించనున్నాడు. మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది కెరీర్‌లో 100వ మ్యాచ్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు అయిన అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, వృద్దిమాన్ సాహాలపై సెలెక్షన్ కమిటీ వేటు వేయడంతో వీరి ప్లేస్‌ల్లో జట్టులోకి వచ్చే ఆటగాళ్లు ఎవరు? టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనే చర్చ తీవ్రమైంది. అజింక్య రహానే, చతేశ్వర్ పుజారాలు లేకపోవడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేసేందుకు శుభ్‌మన్‌ గిల్‌తో పాటు హనుమ విహారీ, శ్రేయస్‌ అయ్యర్‌‌లు పోటీ పడుతున్నారు. టీ20 సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ లెక్కన అతన్ని టెస్ట్‌ల్లో కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

Story first published: Wednesday, March 2, 2022, 23:02 [IST]
Other articles published on Mar 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+