Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ ఉంటే ఆటగాళ్లకు పూనకాలే:టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ జట్టులో ఉంటే ఆటగాళ్లందరికీ పునకాలేనని చెప్పాడు. సహచర ఆటగాళ్లపై కోహ్లీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పాడు. అతని కారణంగా చుట్టూ ఉన్న ఆటగాళ్లు కూడా మైదానంలో మరింత ఎఫెర్ట్ పెడుతారని తెలిపాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ తోపేనని చెప్పాడు.

India Playing XI: ఆ నలుగురికి నిరాశే.. శ్రీలంకతో తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI: ఆ నలుగురికి నిరాశే.. శ్రీలంకతో తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే!

టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌ బాధ్యతల నుంచి టీ దిలీప్ ఇటీవలే తప్పుకున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోనే 2021లో ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన టీ దిలీప్ ఐదేళ్లు సేవలందించాడు. ఇంగ్లండ్ టూర్ అనంతరం అతని కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు బీసీసీఐ నిరాకరించింది. దాంతో టీ దిలీప్‌కు ఉద్వాసన తప్పలేదు.

T Dilip Reveals Virat Kohli s Biggest Impact on Team India Beyond His Batting

కోహ్లీ ఇంటెంట్‌లో తేడా ఉండదు..

తాజాగా జియోస్టార్ షోలో మాట్లాడిన టీ దిలీప్.. కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ఆడుతున్నా.. ట్రైనింగ్ సెషెన్స్‌లో పాల్గొన్నా ఒకే ఇంటెంట్‌ చూపిస్తాడని తెలిపాడు. ట్రైనింగ్ సెషన్స్‌లో కూడా డైవ్ చేస్తూ బంతులను అడ్డుకుంటాడని దిలీప్ వెల్లడించాడు.

'విరాట్ కోహ్లీ.. ఇంటెన్సిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడడు. పవర్‌ప్లేలో అతని ఆట తీరును మీరు చూసే ఉంటారు. బ్యాటర్‌గా అతను ఎలా ఉంటాడో.. కవర్ లేదా షార్ట్ మిడ్‌ వికెట్‌లో అతను ఫీల్డింగ్ చేసే తీరు కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ విరాట్ కోహ్లీ చాలా చురుకుగా డైవ్స్ చేస్తూ ఫీల్డింగ్ చేశాడు. తన ఆటతీరుతో ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకొస్తాడు.

అతని ఫీల్డింగ్ అమోఘం..

కెరీర్ చివరి దశలో ఉన్నా కూడా డెత్ ఓవర్లలో మైదానం చుట్టూ పరుగెడుతాడు. సర్కిల్ బయటకు ఫీల్డింగ్ విస్తరించినప్పుడు పరుగెత్తే తొలి ఆటగాడు అతనే. జట్టు కోసం అతను చూపించే ఇంటెండ్ అమోఘం. మైదానంలో అతని ప్రవర్తన నన్ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బంతి దగ్గరగా ఉన్నప్పుడే కాకుండా దూరంగా ఉన్నప్పుడు కూడా రియాక్ట్ అవుతుంటాడు.

IND vs SL: ఆ వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌కు మళ్లీ మొండి‌చేయేనా?

Also Read

IND vs SL: ఆ వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌కు మళ్లీ మొండి‌చేయేనా?

బంతి ఎప్పుడూ తన చేతుల్లోనే ఉండాలని కోరుకుంటాడు. విరాట్ కోహ్లీ ఆట తీరు.. ప్రాక్టీస్ సెషన్స్, మ్యాచ్‌ల్లోనూ ఒకేలా ఉంటుంది. అతనితో కలిసి ఆడుతున్నప్పుడు ఇతర ఆటగాళ్లు కూడా ప్రభావితమవుతారు. మైదానంలో మరింత ఎఫెర్ట్ పెట్టే ప్రయత్నం చేస్తారు. జట్టులో విరాట్ కోహ్లీ తీసుకువ్చే ప్రభావం అలాంటిది.'అని దిలీప్ కొనియాడాడు.

Story first published: Tuesday, August 11, 2026, 18:52 [IST]
Other articles published on Aug 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+