అమ్మాయిలతో దిగ్గజ క్రికెటర్ల ఎఫైర్స్.. మంచి ఆటగాళ్లే!
క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌లో క్రికెటర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆటగాళ్లు ఒక్క మంచి ప్రదర్శన చేసినా రాత్రికి రాత్రే స్టార్లవుతారు. అభిమానుల క్రేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు కోట్ల రూపాయాలను ఆర్జిస్తారు. స్టార్లుగా ఎదిగిన ఆటగాళ్లకు అమ్మయిల్లో కూడా క్రేజ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా హీరోయిన్స్ త్వరగా ఆటగాళ్లకు కనెక్ట్ అవుతారు. పాత తరం ఆటగాళ్లు కూడా ఇలానే హీరోయిన్ల మాయలో పడి సీక్రెట్‌గా ఎఫైర్స్ నడిపారు. అయితే సోషల్ మీడియా అంతగా లేని ఆ కాలంలో ఇలాంటి విషయాలు అంతగా వెలుగులోకి వచ్చేవి కావు. అయితే కొంతమంది ఆటగాళ్ల ఎఫైర్స్ మాత్రం అప్పట్లో జోరుగా ప్రచారం జరిగాయి.
1. మహమ్మద్ అజారుద్దీన్
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ తన మొదటి భార్య నౌరీన్‌తో విడాకులు తీసుకొని, బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీని పెళ్లి చేసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తాతో కూడా అజారుద్దీన్ ఎఫైర్ నడిపించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఎఫైర్ కారణంగానే బిజ్లానీతో అజారుద్దీన్ విడాకులు తీసుకున్నాడని ప్రచారం జరిగింది.

2. సౌరవ్ గంగూలీ
1990లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ హీరోయి నగ్మాతో ప్రేమాయణం నడిపాడని వార్తలు వచ్చాయి. 1999 ప్రపంచకప్ సమయంలో ఈ ఇద్దరూ కలుసుకున్నారని, బాహటంగానే తిరగారని, సీక్రెట్‌గా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడని కూడా పుకార్లు వెలువడ్డాయి. అయితే తన వైవాహిక జీవితానికి ఇబ్బంది కలగకుండా గంగూలీనే ఈ సంబంధాన్ని వదులుకున్నాడని ప్రచారం జరిగింది.
3. వినోద్ కాంబ్లీ
వినోద్ కాంబ్లీ తన మొదటి భార్య నోయెల్లా లూయిస్‌కు విడాకులు ఇచ్చి, ఫ్యాషన్ మోడల్ అయిన ఆండ్రియా హెవిట్‌ను వివాహం చేసుకున్నాడు. ఆండ్రియాతో అతని ఎఫైర్ తన మొదటి వివాహానికి ముందు ముగింపు పలికిందనే ప్రచారం ఉంది.
4. రవిశాస్త్రి
రవిశాస్త్రి, ప్రముఖ బాలీవుడ్ నటి అమృత సింగ్ మధ్య ప్రేమ వ్యవహారం గురించి అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. వారిద్దరూ కొంతకాలం డేటింగ్ చేశారని, ఆ తర్వాత విడిపోయారని ప్రచారం జరిగింది.
5. కపిల్ దేవ్
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్.. బాలీవుడ్ నటి సారికాతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ ఇద్దరూ బాహటంగానే తిరిగారని పుకార్లు వెలువడ్డాయి. అయితే వీరి ప్రేమాయణానికి త్వరగానే ముగింపు పడింది. కపిల్ దేవ్ రోమినిని వివాహం చేసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications