Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Anil Kumble: ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌తో భారత క్రికెట్ దిగ్గజం భేటీ.. తెరపైకి అనేక ఊహాగానాలు!

Former Indian Cricketer Anil Kumble Meets AP CM YS Jagan

తాడేపల్లి: టీమిండియా మాజీ కోచ్‌, దిగ్గజ స్పిన్నర్ అనిల్‌ కుంబ్లే.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం వైఎస్ జగన్‌తో భేటీ అయిన భారత స్పిన్ దిగ్గజం.. క్రీడలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముందుగా సీఎం జగన్ కు పుష్పగుచ్చం ఇచ్చిన కుంబ్లే.. అనంతరం ఆయనతో కలిసి కూర్చుని ఏపీలో క్రీడారంగం అభివృద్ధిపై చర్చించారు.

స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాయం..

ముఖ్యంగా ఏపీలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు తన సహకారం అందిస్తానని అనిల్ కుంబ్లే సీఎం జగన్ కు తెలిపారు. దీంతో పాటు క్రీడా పరికరాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా ప్రయత్నించాలని సీఎం జగన్ కు ఆయన సలహా ఇచ్చారు. క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీలు ప్రస్తుతం జలంధర్, మీరట్‌ లాంటి నగరాల్లో మాత్రమే ఉన్నాయని, అక్కడి నుంచే అన్ని రకాల క్రీడా సామగ్రి సరఫరా జరుగుతుందని కుంబ్లే.. సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో క్రీడా సామగ్రి ఉంటుందని, దక్షిణాది క్రీడాకారులకు మేలు జరుగుతుందని ఆయన సీఎంకు వివరించారు. దీనికి సంబంధించి తన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నానని కుంబ్లే చెప్పారు. దీనిపై చర్యలు తీసుకుంటామని జగన్ కుంబ్లేకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

క్రికెట్ అకాడమీ కోసమేనా?

క్రికెట్ అకాడమీ కోసమేనా?

మరోవైపు సీఎం జగన్‌తో అనిల్ కుంబ్లే భేటీపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభించేందుకు కుంబ్లే ప్రయత్నిస్తున్నారా?.. అనుమతులు, ప్రోత్సాహకాల కోసమే సీఎం జగన్‌తో భేటీ అయ్యారా? అనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అనిల్ కుంబ్లే తన క్రికెట్ కెరీర్‌లో సాధించిన ఘనతలను సీఎం జగన్‌కు వివరించడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఇక ఇటీవలే భారత బ్యాడ్మింటన్ పీవీ సింధుకు విశాఖపట్నంలో అకాడమీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న క్రీడాకారులకు సీఎం జగన్ రూ. 5 లక్షల ప్రోత్సాహం కూడా అందజేశారు.

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు..

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు..

ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన దిగ్గజ బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు నెలకొల్పాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో 132 టెస్టులు, 271 వన్డే మ్యాచ్‌లు ఆడిన జంబో... మొత్తం 956 వికెట్లు పడగొట్టాడు. 1999లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన అనిల్ కుంబ్లే.. ఈ ఘనత సాధించిన ఏకైక భారత బౌలర్‌గా ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్నాడు. 2008లో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ కర్ణాటక ప్లేయర్... ఆ తర్వాత టీమిండియాకి హెడ్ కోచ్‌ కూడా పనిచేసాడు. 2017లో కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా వైదొలిగాడు.

Story first published: Monday, July 5, 2021, 20:14 [IST]
Other articles published on Jul 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+