Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రస్తుతం ధోనీని ఎంపిక చేయను.. మహీని కెప్టెన్ చేసిన సెలెక్టర్

Former India selector Venkatpathy Raju has hinted that he might not have selected MS Dhoni now

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ ముగిసినట్టేనని తెలుపుతున్న మాజీల జాబితాలో తాజాగా మరో క్రికెటర్ చేరాడు. ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గావస్కర్‌లు మహీ రీ ఎంట్రీ కష్టమేనని స్పష్టం చేశారు. ఇక తాజాగా మాజీ సెలెక్టర్ వెంకటపతి రాజు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

 పునరాగమనం చాలా కష్టం..

పునరాగమనం చాలా కష్టం..

ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను సెలెక్షన్ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉంటే మాత్రం ధోనీని ఎంపిక చేయనన్నాడు. ‘ఏ ప్లేయరైనా జట్టు రేసులో నిలవాలంటే ఏదో టోర్నీ ఆడుతుండాలి. అది డొమెస్టిక్ క్రికెట్ అయినా.. ఇండియా ఏ సిరీసైనా లేక మరే కాంపిటేటివ్ క్రికెట్ అయినా సరే. కానీ ఆడటం మాత్రం ముఖ్యం. నువ్వేంటో ఇతరుల ముందు నిరూపించుకోకున్నా.. నీ మనస్సాక్షి‌నైనా ఒప్పించుకోవాలి.

అంతర్జాతీయ క్రికెట్ ఆడటం అంత సులువు కాదు. దానికి ప్రత్యేకమైన నైపుణ్యంతో పాటు ఫిట్‌నెస్ కావాలి. నేను ఆడుతున్న సమయంలో రీఎంట్రీ కోసం ఏంత కష్టపడ్డానో నాకింకా గుర్తుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత జట్టులో చోటుదక్కించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రంజీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మినహాయించి ప్రత్యేకమైన శిక్షణ తీసుకోవాల్సి వచ్చింది'అని ఈ మాజీ స్పిన్నర్ తెలిపాడు.

ధోనీని కెప్టెన్ చేసింది రాజే...

ధోనీని కెప్టెన్ చేసింది రాజే...

ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేసిన సెలెక్షన్ ప్యానెల్‌లో వెంకటపతి రాజు ఓ సభ్యుడు. అలాంటిది ఇప్పుడు అతను ధోనీని ఎంపిక చేయనని వ్యాఖ్యానించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక ధోనీ సారథ్యంలోనే భారత్ 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న విషయం తెలిసిందే.

8 నెలలు దూరం..

8 నెలలు దూరం..

ఇక ధోనీ వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి అనంతరం సుమారుగా 8 నెలలు ఆటకు దూరమయ్యాడు. దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయాడు. అయితే ఐపీఎల్‌లో సత్తా చాటితే ధోనీకి అవకాశాలుంటాయని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌లో ధోనీ రీ ఎంట్రీ కోసం ఎదురు చూసిన అతని అభిమానులకు కరోనా షాకిచ్చింది.

దీని దెబ్బకు మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15 వాయిదా పడటం.. అసలు జరుగుతుందో లేదో అనే అనుమానాలు రేకత్తడంతో ధోనీ భవితవ్యంపై గందరగోళం నెలకొంది. దీనికి తోడు రోజుకో మాజీ క్రికెటర్ మహీ కెరీర్ ముగిసినట్లేనని అభిప్రాయపడటం అని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

Story first published: Sunday, March 22, 2020, 16:27 [IST]
Other articles published on Mar 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+