Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా మాజీ పేసర్.. బీసీసీఐలో కన్నడిగులదే రాజ్యం!

 Former India pacer Venkatesh Prasad likely to be named Team India chief selector

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విఫలమవ్వడంతో టీమ్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ముందుగా చేతన్ శర్మ సారథ్యంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. వీరి పదవి కాలానికి ఇంకా సమయం ఉన్నా.. ప్రపంచకప్‌కు సరైన జట్టును ఎంపిక చేయలేదనే కారణంతో రద్దు చేసింది. కొత్త సెలెక్షన్ కమిటీ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త సెలెక్షన్ ప్యానెల్‌ కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 200 మందిలో ఎంపికయ్యే నలుగురు ఎవరా? అనేది ఇప్పుడూ హాట్ టాపిక్‌మారింది. అంతేకాకుండా నయ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎవరు ఎంపిక అవుతారనే చర్చ కూడా భారత క్రికెట్‌ సర్కిల్‌లో జోరుగా నడుస్తోంది.
చీఫ్ సెలెక్టర్‌గా వెంకటేశ్ ప్రసాద్..

చీఫ్ సెలెక్టర్‌గా వెంకటేశ్ ప్రసాద్..

మాజీ క్రికెటర్లు నయాన్ మోంగియా, మనీందర్ సింగ్, నిఖిల్ చోప్రాలు ఈ రేసులో ఉన్నారని వార్తలు రాగా.. తాజాగా టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ పేరు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఖారారు అయినట్లు తెలుస్తోంది. కర్నాటకకు చెందిన ఈ మాజీ పేసర్ అభ్యర్థిత్వానికి క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) కూడా మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అతని పేరును బీసీసీఐ అధికారిక ప్రకటించనుందని ఓ అధికారి పేర్కొన్నట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ పేర్కొంది.

ఈ నెల చివరిలో..

ఈ నెల చివరిలో..

'ఈనెల చివరివరకు సెలక్షన్ కమిటీ చైర్మన్ తో పాటు ఇతర సభ్యుల పేర్లను ప్రకటిస్తాం. చైర్మన్ రేసులో టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ముందు వరుసలో ఉన్నాడు. బహుశా అతనే ఈ పదవిని దక్కించుకోవచ్చు.'అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. ఒకవేళ వెంకటేశ్ ప్రసాద్ ఛీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైతే.. బీసీసీఐ‌లో కన్నడిగులదే రాజ్యం కానుంది. ఇప్పటికే బీసీసీఐ ప్రెసిడెంట్‌గా కర్ణాటకకు చెందిన రోజర్ బిన్నీ ఉండగా.. టీమిండియా హెడ్ కోచ్‌గా అదే రాష్ట్రానికి చెందిన రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. వీరికి జతగా వెంకటేశ్ ప్రసాద్ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైతే.. బీసీసీఐ టాప్ ప్లేస్‌లో కర్నాటకకు చెందినవారే ముగ్గురు ఉండనున్నారు.

టీ20 స్పెషలిస్ట్..

టీ20 స్పెషలిస్ట్..

ఇక సెలక్షన్ కమిటీలో చైర్మన్ తో పాటు నలుగురు సభ్యులు ఉండనుండగా.. వీరిలో ఒకర్ని టీ20 ఆడిన అనుభవం ఉన్న ఆటగాడిని తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. టీ20 ఫార్మాట్ ఆడిన అనుభవం ఉన్న ఆటగాడిని సెలక్షన్ కమిటీలో తీసుకుంటే అతను ఈ ఫార్మాట్‌కు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం దక్కుతుందని బీసీసీఐ భావిస్తోంది.

Story first published: Friday, December 9, 2022, 16:10 [IST]
Other articles published on Dec 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+