Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతన్ని తప్పించండి.. సంజూ తట్టుకోలేకపోతున్నాడు: మహమ్మద్ కైఫ్

టీ20 ఫార్మాట్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించాలని మాజీ క్రికెటర్ మహహ్మద్ కైఫ్ డిమాండ్ చేశాడు. గాయం సాకుతో గిల్‌ను తప్పించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు. శుభ్‌మన్ గిల్‌కు వరుసగా అవకాశాలు ఇవ్వడాన్ని సంజూ శాంసన్ తట్టుకోలేకపోతున్నాడని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.

'పరిస్థితులను మీ నియంత్రణలో ఉంచుకోవాలంటే శుభ్‌మన్ గిల్‌ను తప్పిస్తున్నామనే పదాన్ని ఉపయోగించకండి. అందుకు బదులుగా అతనికి విశ్రాంతి ఇస్తున్నామని, లేదా మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నామని చెప్పండి. ఏది ఏమైనా చివరి రెండు టీ20ల్లో టీమిండియా శుభ్‌మన్ గిల్ స్థానంలో మరో ఆటగాడిని ఆడించాలి. ముఖ్యంగా సంజూ శాంసన్‌‌ను ఆడించాలి. అతనికి ఆ హక్కు ఉంది. ఇప్పటికే సంజూ..'గిల్ ఏడాది నుంచి ఆడుతున్నాడు. కానీ నేను 2-3 మ్యాచ్‌లు విఫలమైతేనే పక్కనపెట్టారు.'అని అనుకుంటున్నాడు.

Former India Cricketer Questions Sanju Samson s Omission After IND vs SA 3rd T20I Claims Dropped After 2 3 Poor Innings

తుది జట్టులో అవకాశాల విషయంలో ఎక్స్‌ ఫ్యాక్టర్ ఆటగాళ్లకు ఒకటి రెండు అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. కానీ శుభ్‌మన్ గిల్ ఇప్పటికే చాలా ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతని వైఫల్యం గురించి ఇప్పుడే మాట్లాడటం లేదు. చాలా రోజులుగా చర్చిస్తున్నాం. కాబట్టి గిల్ విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. గిల్‌ను తప్పించే సమయం ఆసన్నమైంది.

భారత జట్టులో కొన్ని విషయాలను సూటిగా చెప్పలేం. ఆటగాళ్లను నేరుగా తప్పించామని చెప్పకుండా విశ్రాంతి ఇస్తున్నామని చెప్పడం వారికిచ్చే గౌరవం. నేను లెజెండ్స్ లీగ్‌లో ఆడుతున్నప్పుడు ఒక ఆటగాడు తుది జట్టులో లేడు. సచిన్ పాజీ మా కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ ఆటగాడి వేలికి గాయమైందని, లేదా జ్వరం వచ్చిందని చెప్పాలని సచిన్‌కు చెప్పారు'అని మహమ్మద్ కైఫ్ గుర్తుచేసుకున్నాడు.

సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మూడు మ్యాచ్‌ల్లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యారు. సూర్య వరుసగా 12 (11), 5 (4), 12 (11) పరుగులు చేస్తే.. శుభ్‌మన్ గిల్, 4, 0, 28 పరుగులే చేసి నిరాశపర్చాడు. ఈ ఏడాది సూర్య 213 పరుగులు చేయగా.. శుభ్‌మన్ గిల్ 293 పరుగులే చేశాడు. టీ20 ప్రపంచకప్ ముందు ఈ ఇద్దరూ స్టార్ ఆటగాళ్ల పేలవ ఫామ్‌ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఇద్దర్నీ తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గిల్ కోసం సంజూ శాంసన్‌ను పక్కపెట్టడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. సంజూ శాంసన్ తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన గిల్.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.

Story first published: Monday, December 15, 2025, 15:46 [IST]
Other articles published on Dec 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+