టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కలిసారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కైఫ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో రామ్ చరణ్‌పై మహమ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించారు. గ్లోబల్ స్టార్ అయినా కూడా ఒదిగి ఉండటం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో రామ్‌చరణ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఆయన నటన, డ్యాన్స్‌లకు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఈ సినిమాతో రామ్ చరణ్‌కు సాధారణ వ్యక్తులతో పాటు సెలెబ్రెటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. తాజాగా ముంబై వేదికగా జరుగుతున్న ఐఎస్‌పీఎల్ టీ10 టోర్నీలో రామ్ చరణ్‌కు చెందిన ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ కూడా బరిలో నిలిచింది. ఈ టోర్నీలో తమ జట్టుకు అండగా నిలిచేందుకు రామ్ చరణ్ మ్యాచ్‌లకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌ను మహమ్మద్ కైఫ్ కలిసాడు. కాసేపు సరదాగా మాట్లాడాడు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను కైఫ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

'ఆయనను కలిస్తే మనం కూడా నాటు నాటు స్టెప్పు వేయాలనిపిస్తోంది. గ్లోబర్ స్టార్ అయినా కూడా ఒదిగి ఉండటం ఆయన ప్రత్యేకత. ఆయన మనందరినీ గర్వపడేలా చేశారు. ఆయనకు మరిన్ని హిట్స్ రావాలని కోరుకుంటున్నా.'అని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
You meet him and you want to do a Naatu Naatu step. Such a global super star but so down to earth. You made all of us proud. Best wishes for many more hits. #ramcharan pic.twitter.com/vJmnNLOwzm
— Mohammad Kaif (@MohammadKaif) February 11, 2025
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయం సాధించాలంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మెరుగైన ప్రదర్శన చేయాలని కైఫ్ అన్నాడు. 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్రివర్ణ పతకాన్ని పట్టుకొని ఉన్న ఫొటో ఇంకా నా మదిలో అలానే ఉంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత కృతనిశ్చయంగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్ గెలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలనుకుంటున్నారు. ఒకరు 37 ఏళ్ల వయసులో ఉంటే మరొకరికి 36 ఏళ్లు. ఈ ఇద్దరూ ఎక్కువ కాలం ఆడలేరు. కాబట్టి వారిని ఆశీర్వదించండి. రోహిత్ శర్మ ఘనమైన ఆరంభం ఇస్తే.. చివరి వరకు ఆడి కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తాడు. ఈ ఇద్దరు ఆడితేనే టీమిండియా విజేతగా నిలుస్తోంది.'అని కైఫ్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.