Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల పురస్కార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని హిట్ మ్యాన్ స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువు కేంద్ర మంత్రులు, ప్రముఖులు, అవార్డు గ్రహితలు హాజరయ్యారు.

రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అవార్డు స్వీకరించే క్రమంలో అతని సతీమణి రితికా సజ్దే సంతోషం వ్యక్తం చేస్తూ కనిపించారు. క్రికెట్‌లో దేశానికి అందించిన సేవలు గానూ రోహిత్ శర్మను ఈ అవార్డు వరించింది. క్రీడా అత్యున్నత పురస్కారమైన ఖేల్ రత్న అవార్డు‌ను కూడా రోహిత్ శర్మ ఇప్పటికే అందుకున్న సంగతి తెలిసిందే.

Rohit Sharma Receives Prestigious Padma Shri Award from President Droupadi Murmu

అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ మెరుగైన ప్రదర్శన చేశాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. ఇంగ్లండ్ పర్యటనలో జరిగే వన్డే సిరీస్‌తో రోహిత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.

అభిమానిని తోసేసిన సెక్యూరిటీ గార్డ్.. రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్!(వీడియో)

అభిమానిని తోసేసిన సెక్యూరిటీ గార్డ్.. రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్!(వీడియో)

రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ విడతలో మొత్తం 2 పద్మ విభూషణ్‌, 7 పద్మభూషణ్‌, 56 పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు.

సినీ, సాహిత్య, వైద్య, క్రీడా తదితర రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులు అవార్డులు దక్కాయి. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ పురస్కారం లభించగా.. ప్రముఖ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడుకు కూడా పద్మభూషణ్ అవార్డు దక్కింది.

వైభవ్ సూర్యవంశీతో రోహిత్ స్థానానికి ముప్పు: మాజీ క్రికెటర్

వైభవ్ సూర్యవంశీతో రోహిత్ స్థానానికి ముప్పు: మాజీ క్రికెటర్

తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌తో పాటు నటుడు ఆర్. మాధవన్‌కు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. దేశ అభివృద్ధికి, తమ తమ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తోంది.

Story first published: Tuesday, June 23, 2026, 18:36 [IST]
Other articles published on Jun 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+