Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షాకింగ్ న్యూస్.. టీమిండియా మాజీ కెప్టెన్ మృతి

Bishan Singh Bedi: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 77 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. భారత్ జట్టుకు 22 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన బిషన్ సింగ్ బేడీ
1967 -1979 మధ్య కాలంలో 67 టెస్టులు ఆడి 266 వికెట్లు తీశాడు. 10 వన్డే మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు.

బిషన్ సింగ్ బేడీ మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. బిషన్ సింగ్ బేడీతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.

Former India captain Bishan Singh Bedi Dies At 77

'బిషన్ సింగ్ బేడీ అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగిచింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.'అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

ఎరపల్లి ప్రసన్న, బీఎస్‌ చంద్రశేఖర్, ఎస్‌ వెంకటరాఘవన్‌లతో పాటు బిషన్ సింగ్ బేడీ భారత్‌ స్పిన్ బౌలింగ్‌ దశ, దిశను మార్చాడు. భారత్ సాధించిన తొలి వన్డే విజయంలో బిషన్ సింగ్ బేడీ కీలక పాత్ర పోషించారు. 1975 ప్రపంచ కప్‌లో ఓ మ్యాచ్‌లో 12 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 8 ఓవర్లు మెయిడిన్ చేశాడు. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.

బిషన్ సింగ్ ధాటికి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఈస్ట్ ఆఫ్రికాను 120 పరుగులకే పరిమితం చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బిషన్ సింగ్ అద్భుత రికార్డు ఉంది. దేశవాళీ క్రికెట్‌లో ఆయన 1560 వికెట్లు తీసాడు. నార్తర్న్ పంజాబ్ తరపున 15 ఏళ్ల వయసులో బరిలోకి దిగిన బిషన్ సింగ్ బేడీ.. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

1974-75 రంజీ సీజన్‌లో 64 వికెట్లు పడగొట్టాడు. సొగసైన బౌలింగ్ శైలీతో బేడీ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేవాడు. 1969లో కోల్‌కతా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బిషన్‌సింగ్‌ బేడీ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో 7/98 గణంకాలు నమోదు చేశాడు.

1977-78లో పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో (10/194) 10 వికెట్లు పడగొట్టాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తర్వాత భారత కెప్టెన్‌గా బేడీ సేవలందించాడు. 1976‌లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో బిషన్ సింగ్ బేడీ సారథ్యంలోని టీమిండియానే వన్డేల్లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

1979, జూన్ 16న శ్రీలంకతో చివరి వన్డే ఆడిన బిషన్ సింగ్ బేడీ. అదే ఏడాది ఆగస్ట్ 30న ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.

Story first published: Monday, October 23, 2023, 16:59 [IST]
Other articles published on Oct 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+