పాకిస్థాన్ ఓ చెత్త టీమ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
పాకిస్థాన్ ఓ చెత్త టీమ్ అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ చాలా బలహీనంగా ఉందని, మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ సునాయసంగా 3-0తో క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పాడు. సొంతగడ్డపై మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది.
లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 171 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా షఫీక్(61) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇమామ్ ఉల్ హక్(42) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్(5/51), జోష్ టంగ్(5/46) ఐదేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు.

అనంతరం ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 366 పరుగులు చేసింది. జోర్డాన్ కాక్స్(73), కెప్టెన్ జోరూట్(66), హ్యారీ బ్రూక్(91), డాన్ లారెన్స్ సత్తా చాటారు. క్రీజులో జేమి స్మిత్(16 బ్యాటింగ్)తో పాటు జోఫ్రా ఆర్చర్(0) ఉన్నారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్(5/92) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్ షెహ్‌జాద్, మహమ్మద్ అలీ తలో వికెట్ తీసారు.
తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్టువర్ట్ బ్రాడ్.. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'పాకిస్థాన్ బలహీనమైన జట్టు. కనీస పోటీ కూడా ఇవ్వలేదు. కెరీర్ చివరి దశలో ఉన్న 36 ఏళ్ల మహమ్మద్ అబ్బాస్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడమే పాక్ జట్టు బలహీనతను తెలియజేస్తోంది. గత పర్యటనల్లో ఎదురైన ఫలితమే ఈసారి కూడా పాక్‌కు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ సునాయసంగా 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలి. ఒకవేళ ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ గెలవకపోతే అంతకంటే ఘోర అవమానం మరొకటి ఉండదు.'అని బ్రాడ్ చెప్పుకొచ్చాడు.
ఫిట్‌నెస్ సమస్యలతో ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు బాబర్ ఆజామ్ దూరమయ్యాడు. దాంతో సల్మాన్ అఘా తాత్కలిక సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2024లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో గెలుచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

