Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రి కాబోతున్న సారా టేలర్.. తన భాగస్వామి గర్భం దాల్చిందంటూ ట్వీట్!

 Former England cricketer Sarah Taylor announces partner’s pregnancy

లండన్: ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ తండ్రి కాబోతుంది. స్వలింగ సంపర్కురాలైన ఈ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్.. తన భాగస్వామి గర్భం దాల్చిందంటూ బుధవారం ట్వీట్ చేసింది. డయానా అనే మహిళతో సహజీవనం చేస్తున్న సారా.. అమ్మ కావాలనేది తన పార్టనర్ కోరికని పేర్కొంది.
'అమ్మకావాలనేది నా భాగస్వామి కల. ఆ జర్నీ అంత సులువు కాదు. అయితే డియానా ఈ విషయంలో పట్టువదల్లేదు. ఆమె బెస్ట్ మదర్ అవుతుందని నాకు తెలుసు. నేను ఈ కుటుంబంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. 19 వారాల్లో మా జీవితం పూర్తిగా మారిపోనుంది.'అని సారా టేలర్ పేర్కొంది. గుడ్ న్యూస్ చెప్పిన సారా టేలర్‌కు అభిమానులు, మాజీ క్రికెటర్లు అభినందనలు తెలియజేస్తున్నారు.

అత్యంత అందమైన మహిళా క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సారా టేలర్.. 2016లో మెంటల్ హెల్త్ కారణాలతో క్రికెట్‌కు బ్రేక్‌ ప్రకటించింది. మళ్లీ పునరాగమనం చేసిన సారా టేలర్.. అనూహ్యంగా 2019లో ఆటకు వీడ్కోలు పలికింది. రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. పురుషుల జట్టుకు కోచ్‌గా పనిచేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డుకెక్కింది. అబుదాబీ టీ10 లీగ్‌లో అబుదాబీ టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన సారా టేలర్.. అంతకుముందు ఇంగ్లండ్ పురుషుల కౌంటీ టీమ్‌ సుసెక్స్‌ జట్టుకు స్పెషలిస్ట్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించింది.

33 ఏళ్ల సారా టేలర్.. తన కెరీర్‌లో ఇంగ్లండ్ తరుపున 10 టెస్టులు , 126 వన్డేలు, 90 టీ20 మ్యాచులు ఆడింది. టెస్టుల్లో 300 పరుగులు చేసిన సారా టేలర్.. వన్డేల్లో 7 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో 4056 పరుగులు, 90 టీ20ల్లో 16 హాఫ్ సెంచరీలతో 2177 పరుగులు చేసింది. వికెట్ కీపర్‌గా 138 క్యాచులు అందుకున్న సారా టేలర్, 104 స్టంపౌట్లు చేసింది. సారా టేలర్‌కు భారత్‌లోనూ అభిమానులు ఉన్నారు. ఆమె ఆట కంటే అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

Story first published: Wednesday, February 22, 2023, 16:21 [IST]
Other articles published on Feb 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+