న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరు నెలల క్రితమే కరోనా వచ్చింది.. ఫ్లూ అనుకున్నా: మాజీ క్రికెటర్

Former England cricketer Ian Botham narrates his experience with Covid-19

లండన్: ఈ ఏడాది ఆరంభంలోనే తనకూ కరోనా వైరస్ సోకిందని ఇంగ్లండ్‌ క్రికెట్‌ దిగ్గజం ఇయాన్‌ బోథమ్‌ వెల్లడించాడు. అయితే అప్పట్లో దీని గురించి పెద్దగా చర్చ లేకపోవడంతో 'భయంకరమైన ఫ్లూ'అని తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పాడు.

'ఆరు నెలల క్రితం కరోనా గురించి ఎవరికీ తెలియదు. నేను కూడా వినలేదు. కానీ, డిసెంబరు చివర.. జనవరి ఆరంభంలో నాకు ఆ వైరస్‌ సోకింది. అయితే అది కరోనా అని మాత్రం తెలియదు. ఫ్లూ చాలా తీవ్రంగా వచ్చిందని అనుకున్నా. దీని గురించి పెద్దగా తెలియకపోవడంతో చాలా రోజులు బాధపడ్డా. కానీ తర్వా తగ్గిపోయింది. చూద్దాం ఇప్పుడు కూడా ఎన్ని రోజులు ఉంటుందో' అని బోథమ్‌ చెప్పాడు.

జనాలు మరికొన్ని రోజులు ఓపిక పడితే.. రాబోయే రెండు వారాల్లో పరిస్థితి మరింత మెరుగవుతుందన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులకు స్పందిస్తున్న తీరు బాగుందన్నాడు. ఇంగ్లండ్ తరఫున 102 టెస్టులు, 116 వన్డేలు ఆడిన బోథమ్.. సంప్రదాయక ఫార్మాట్‌లో 5200, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 2113 రన్స్ చేశాడు. ఆల్‌రౌండర్ అయిన ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. టెస్ట్‌ల్లో 383, వన్డేల్లో 145 వికెట్లు పడగొట్టాడు.

ధోనీ బలిదాన్ బ్యాడ్జ్ వద్దని 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌‌'కు అనుమతా?.. ఐసీసీపై ఫ్యాన్స్ ఫైర్ధోనీ బలిదాన్ బ్యాడ్జ్ వద్దని 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌‌'కు అనుమతా?.. ఐసీసీపై ఫ్యాన్స్ ఫైర్

Story first published: Tuesday, June 30, 2020, 10:00 [IST]
Other articles published on Jun 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X