Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ మాజీ క్రికెటర్‌ది ఆత్మహత్య!

ఇంగ్లండ్ దిగ్గ‌జ క్రికెట‌ర్ గ్రాహం థోర్ప్‌ది సహజ మరణం కాదని, ఆత్మహత్య చేసుకున్నారని ఆయన సతీమణి అమండా వెల్లడించారు. ఈ నెల 5న అనారోగ్య కారణాలతో గ్రాహం థోర్ఫ్ తుదిశ్వాస విడిచారని ఇంగ్లండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దిగ్గజ క్రికెటర్ అకాల మరణం పట్ల యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

అయితే గ్రాహం థోర్ప్‌ అనారోగ్య కారణాలతో మరణించలేదని, బలవన్మరణానికి పాల్పడ్డారని ఆయన సతీమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
మానసిక సమస్యలతో బాధపడిన గ్రాహం థోర్ప్, చాలా కాలం పాటు డిప్రేషన్‌లోకి వెళ్లారని తెలిపారు. అనారోగ్య సమస్యలు తన కుటుంబానికి ఇబ్బందిగా మారయాని భావించి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.

Former England cricketer Graham Thorpe took his own life reveals his wife Amanda

కుటుంబ సభ్యులను బాధపెట్టలేక..
'తాను ఎంతగానో ప్రేమించే భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నప్పటికీ గ్రాహం అనారోగ్య సమస్యల నుంచి కోలుకోలేకపోయారు. చనిపోతేనే తన భార్య, పిల్లలు సుఖంగా ఉంటారని భావించి బలవన్మరణానికి పాల్పడ్డారు'అని అమండా పేర్కొన్నారు. గత రెండేళ్లుగా గ్రాహం తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, దాంతో ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించామని తెలిపారు.

మధ్యలో ఆయన ఆరోగ్యం కుదటపడినట్లు అనిపించినా.. కోలుకోలేకపోయారని చెప్పారు. గ్రాహంను బతికించేందుకు తాము చాలా ప్రయత్నాలు చేశామని, కానీ ఆయన తమ బాధ చూడలేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

100 టెస్ట్‌లు..
గ్రాహం థోర్ఫ్ 1993-2005 మధ్య ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వ‌న్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 44.66 సగటు, 16 సెంచరీల సాయంతో 6,744 పరుగులు చేశాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన గ్రాహం వ‌న్డేల్లో 37.18 సగటుతో 21 అర్ధసెంచరీలతో 2380 ర‌న్స్‌ చేశాడు.

థోర్ప్ సర్రే తరపున 17 సంవత్సరాలు ఆడాడు. అక్కడ అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 241 మ్యాచ్‌లు, 271 లిస్ట్ -ఏ గేమ్‌లు ఆడాడు. కౌంటీ తరపున 20,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

కోచ్‌గానూ ..
క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన అనంతరం కోచ్‌గానూ పని చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా.. అసిస్టెంట్ కోచ్‌గా సేవలందించాడు. అయితే, 2022 ఫిబ్రవరిలో ఇంగ్లండ్ జ‌ట్టు యాషెస్‌ సిరీస్‌లో 4-0తో ఓడిపోయిన అనంతరం కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2022 మార్చిలో అఫ్ఘానిస్థాన్‌ ప్రధాన కోచ్‌గా ఎపికయ్యాడు.

అయితే అతను జట్టులో చేరడానికి ముందే తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. రెండేళ్ల పాటు అనారోగ్యంతో బాధపడిన అతను చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

Story first published: Monday, August 12, 2024, 16:14 [IST]
Other articles published on Aug 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+