Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవోగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్!

Former England Cricketer Andrew Strauss In Contention For Cricket Australias CEO Post

మెల్‌బోర్న్‌: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఇటీవల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క టీ20 ప్రపంచకప్‌పై చర్చ జరుగుతుండానే బోర్డు సీఈవోగా కెవిన్ రాబర్ట్స్ తన పదవికి రాజీనామా చేశాడు. నిక్ హక్లే తాత్కాలిక సీఈవో బాధ్యతలు చేపట్టారు. ఉద్యోగుల లే ఆఫ్స్, పే కట్టింగ్స్‌పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఇంతవరకు బాగానే ఉన్నా ఆశ్చర్యం కలిగించే విధంగా సీఏ సీఈవో రేస్‌లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌ పేరు తెరపైకి వచ్చింది. పైగా క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దల నుంచి భారీ మద్దతు ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా సీఏ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సీఏను నడిపించే సత్తా స్ట్రాస్‌కే ఉందని ఆసీస్ క్రికెట్ పెద్దలు భావిస్తున్నారు.

ఇక ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి 80 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని, గ్రాంట్‌లపై కోత విధించాలని మునపటి సీఈవో కెవిన్‌ రాబర్ట్స్‌ ప్రతిపాదించాడు. దీనిపై పెద్దఎత్తునవిమర్శలు రావడంతో ఈ ఏప్రిల్‌లో రాబర్ట్స్‌ తన పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఇంగ్లండ్‌కు చెందిన నిక్‌ హాక్లీని తాత్కాలిక సీఈవోగా సీఏ నియమించింది. ఫుల్‌ టైమ్‌ సీఈవో పోస్టు కోసం స్ట్రాస్‌ను దరఖాస్తు చేయమని సీఏలో చక్రం తిప్పగల వ్యక్తి సూచించినట్టు సమాచారం.

గతేడాది ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ గెలవడంలో స్ట్రాస్‌ది కీలక పాత్ర. భార్య రూత్ మెక్‌డొనాల్డ్ లివర్ క్యాన్సర్ బారిన పడటంతో స్ట్రాస్ 2018లో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పదవికి రాజీనామా చేశాడు. కానీ అప్పటికే జట్టును అన్ని విధాల సిద్ధం చేశాడు. స్ట్రాస్ భార్య ఇటీవల మరణించింది. అయితే ఆస్ట్రేలియతో అతనికి మంచి సంబంధమే ఉంది. ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయకుముందు 1998-99లో స్ట్రాస్ సిడ్నీ యూనివర్సిటీకి ఆడాడు. ఆ టైమ్‌లోనే తన భార్య రూత్‌ను ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకున్నాడు.

ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు, 127 వన్డేలు, 4 టీ20లు ఆడిన స్ట్రాస్.. సంప్రదాయక ఫార్మాట్‌లో 21 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 7037 పరుగులు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 27 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలతో 4205 రన్స్, పొట్టి క్రికెట్‌లో 73 పరుగులు నమోదు చేశాడు.

Story first published: Friday, June 19, 2020, 10:28 [IST]
Other articles published on Jun 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+