Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పొట్టకూటి కోసం డ్రైవర్‌గా మారిన సీఎస్‌కే మాజీ స్పిన్నర్!

Former CSK Player Suraj Randiv Switches To Bus Driving In Melbourne

మెల్‌బోర్న్‌: భారత్‌తో బాక్సింగ్ డే టెస్ట్‌ ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు ఆస్ట్రేలియా జట్టు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నది. ఆ ప్రాక్టీస్‌ను చూడటానికి వెళ్లిన స్పోర్ట్స్ రిపోర్టర్‌ను ఒక నెట్ బౌలర్ ఆకర్షించాడు. అతని బౌలింగ్ యాక్షన్, బంతి విసురుతున్న వేగం అచ్చం శ్రీలంక మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్పిన్నర్ సూరజ్ రణ్‌దీవ్‌లాగే ఉండటంతో ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆరా తీయగా అనాటి శ్రీలంక మాజీ ఆటగాడే, ఇప్పుడూ నెట్‌ బౌలర్‌గా ఆసీస్ జట్టుకు బంతులు విసురుతున్నాడని తెలిసింది. ఒక జాతీయ జట్టుకు ఆడిన బౌలర్ ఇన్నేళ్ల తర్వాత ఇలా నెట్ బౌలర్ ఎందుకయ్యడని కనుక్కోగా అనేక విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

అంతర్జాతీయ క్రికెట్ ఆడి..

అంతర్జాతీయ క్రికెట్ ఆడి..

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనే కాకుండా ఆస్ట్రేలియా జట్టుకు అప్పుడప్పుడు ఈ శ్రీలంక మాజీ క్రికెటర్ నెట్ బౌలర్‌గా సేవలు అందిస్తున్నాడు. కానీ, అసలు విషయం ఏంటంటే, అతను అదే మెల్‌బోర్న్‌లో ఒక బస్‌డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం స్వదేశంలో చివరి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడిన అతను ఉపాధిని వెతుక్కుంటూ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.

మెల్‌బోర్న్‌లో స్థానిక క్లబ్‌లలో క్రికెట్‌ ఆడుతున్నా... సంపాదన కోసం అతను మరో ఉద్యోగాన్ని చూసుకోక తప్పలేదు. ఫ్రాన్స్‌ కంపెనీ 'ట్రాన్స్‌డెవ్‌' నిర్వహణలో నడుస్తున్న ప్రజా రవాణా బస్సులో అతను డ్రైవర్‌గా ఉన్నాడు. కొన్ని చిన్నస్థాయి క్రికెట్‌ దేశాల్లో ఆదాయం కోసం ఇతర పనులు చేయడం సాధారణమే అయినా... ఒక ఆసియా జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్‌ చిరుద్యోగం చేయడం మాత్రం పెద్దగా కనిపించదు.

మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా..

అతనితోపాటు చింతక జయసింఘే (శ్రీలంక-5 టీ20లు), వాడింగ్టన్‌ వయెంగా (జింబాబ్వే-1 టెస్టు, 3 వన్డేలు) కూడా ఇదే కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉండటం అందర్నీ విస్మయ పరుస్తుంది. లంక తరఫున ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూరజ్ రణ్‌దీవ్.. 2011 శ్రీలంక ప్రపంచకప్ టీమ్‌ సభ్యుడు. టెస్ట్‌ల్లో 43, వన్డేల్లో 36, టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. ఇతనికి ఫస్ట్‌క్లాస్‌లో మంచి రికార్డే ఉంది. 149 మ్యాచ్‌లు ఆడిన రణ్‌దివ్ 681 వికెట్లతో పాటు 4 సెంచరీలు చేశాడు.

 సెహ్వాగ్‌ సెంచరీ చేయకుండా..

సెహ్వాగ్‌ సెంచరీ చేయకుండా..

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను సెంచరీ పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా 'నోబాల్‌' వేసిన ఈ శ్రీలంక స్పిన్నర్ భారత అభిమానులకు బాగానే గుర్తు. 2010లో ఓ ట్రై సిరీస్‌లో భాగంగా ఇలా క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 2011 ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున రణ్‌దీవ్‌ 8 మ్యాచ్‌లు ఆడి ఆకట్టుకునే ప్రదర్శనే (7.68 ఎకానమీ) కనబర్చాడు. లంక తరఫున రణ్‌దీవ్‌ 2016లో చివరి మ్యాచ్‌ ఆడాడు. మరో లంక క్రికెటర్ చింతక జయసింఘే 2009లో భారత్‌పై అరంగేట్రం చేసి 5 టీ20లు ఆడాడు. పేసర్ అయిన వాడింగ్టన్ వయోంగా జింబాబ్వే తరఫున 1 టెస్ట్, 3 వన్డేలు ఆడాడు.

క్లబ్ క్రికెట్ ఆడేందుకు వెళ్లి..

క్లబ్ క్రికెట్ ఆడేందుకు వెళ్లి..

ఈ ముగ్గురు ఆటగాళ్లు క్లబ్ క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లారు. అయితే దాని ద్వారా వీరికి తగినంత ఆదాయం లేకపోవడంతో డ్రైవర్లుగా మారారు. క్లబ్ మ్యాచ్‌లు లేని సమయంలో బస్సులు నడుపుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వీరి ముగ్గురిలో సూరజ్‌కు మంచి అనుభవం ఉండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా నెట్ బౌలర్‌గా ఉపయోగించుకుంటుంది. కరోనా కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా వేతనాల్లో కోత విధించడంతో సూరజ్‌పై ఆ ప్రభావం పడింది. దాంతో అతను బస్సు డ్రైవర్‌గా పనిచేయాల్సి వస్తుందని తెలిపాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు విక్టోరియా ప్రీమియర్ లీగ్‌లో డాండింగ్ క్రికెట్ క్లబ్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Story first published: Tuesday, March 2, 2021, 16:25 [IST]
Other articles published on Mar 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+