ముంబై కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్!
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో తన అభిమానులను అలరించేందుకు ఈ డాషింగ్ ఓపెనర్ సిద్దమవుతున్నాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(ఐవీపీఎల్) అరంగేట్ర సీజన్‌లో బరిలోకి దిగేందుకు సెహ్వాగ్ ముంబై ఛాంపియన్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆటగాడిగానే కాకుండా ఈ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
'ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(ఐవీపీఎల్)లో భాగమైనందుకు సంతోషిస్తున్నాను. నేను ముంబై ఛాంపియన్స్ తరఫున బరిలోకి దిగుతున్నాను. ముంబై ఛాంపియన్స్‌కు మద్దతు తెలపండి. డెహ్రాడూన్‌లో కలుద్దాం'అని సెహ్వాగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.ఐపీఎల్ తరహాలో దిగ్గజ క్రికెటర్లతో జరగనున్న ఐవీపీఎల్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు డెహ్రాడూన్ వేదికగా జరగనుంది.

'ఐపీఎల్ తర్వాత ఆస్థాయిలో అత్యుత్తమ లీగ్‌ను క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికి వెటరన్ ప్లేయర్లతో ఈ లీగ్‌ను నిర్వహించనున్నాం. క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వా, సురేశ్ రైనా వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ లీగ్‌లో భాగం కానున్నారు. భారత్‌లో వెటరన్ క్రికెట్‌కు ఈ టోర్నీ కొత్త శక్తినివ్వనుంది.'అని వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ త్యాగి తెలిపాడు.
ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు పోటీపడనున్నాయి. రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, చత్తీస్‌గడ్ వారియర్స్, తెలంగాణ టైగర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రతీ జట్టులో నాలుగు నుంచి ఐదుగురు వరల్డ్ బెస్ట్ ప్లేయర్లు ఆడనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications