ఐపీఎల్ 2018 విశ్లేషణ: బ్యాట్స్‌మెన్ల కంటే బౌలర్లే చక్కటి ప్రదర్శన

హైదరాబాద్: ఐపీఎల్ యువ క్రికెటర్లకు అవకాశాల గని అని మరోసారి రుజువైంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో లెగ్ స్పిన్నర్లు, మణికట్టు స్పిన్నర్లు ఎక్కువ ప్రభావం చూపుతున్నారని టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నారు.
'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఐపీఎల్‌లో తెలుగు కామెంటేటర్‌గా వెంకటపతి రాజు తన రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ 'ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా ఆడుతున్నాయి' అని అన్నారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఏయే జట్లు నాకౌట్ చేరుకుంటాయనేది ఆసక్తికరంగా
'ప్లే ఆఫ్స్ దగ్గర పడుతున్న సమయంలో ఏయే జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ, బెంగళూరు.. ఇతర జట్ల అవకాశాల్ని దెబ్బతీయొచ్చు. ఒక బ్యాట్స్‌మన్ లేదా ఒక బౌలర్ ఫలితాన్ని తారుమారు చేస్తున్నారు. డెత్ బౌలింగ్ కీలకంగా మారింది. లెగ్ స్పిన్నర్లు, మణికట్టు స్పిన్నర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు' అని తెలిపారు.

బ్యాట్స్‌మెన్ల కంటే బౌలర్లు చక్కటి ప్రదర్శన
'ప్రస్తుత సీజన్‌లో బ్యాట్స్‌మెన్ల కంటే బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. నాలుగు ఓవర్లలో బౌలర్లు చాలా వైవిధ్యం చూపిస్తున్నారు. ఈ విషయంలో స్పిన్నర్లు ముందున్నారు. ఈ ఐపీఎల్‌లో అత్యంత వైవిధ్యమైన.. ప్రభావవంతమైన బౌలింగ్ సన్‌రైజర్స్‌దే. పేసర్లు లేకపోయినా.. భువీ, సిద్ధార్థ్ కౌల్, సందీప్‌శర్మలు వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకుంటున్నారు' అని పేర్కొన్నారు.

పటిష్ట బౌలింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్
'స్పిన్నర్లు రషీద్‌ఖాన్, షకిబ్ అల్ హాసన్ తమకున్న అనుభవంతో చెలరేగుతున్నారు. రషీద్, షకిబ్ ఏడాది పొడవునా ప్రపంచంలో ఎక్కడో ఓ దగ్గర టీ20 లీగ్‌లు ఆడతారు. దీంతో టీ20 క్రికెట్‌లో వారికి మంచి అనుభవం వచ్చింది. బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడం.. వికెట్లు తీయడంలో ఆరితేరారు' అని కొనియాడాడు.

యువ ఆటగాళ్లు రాణిస్తుండటం భారత్‌కు శుభపరిణామం
'గతంలో రవీంద్ర జడేజా, నదీమ్ లాంటి ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఐపీఎల్‌లో బాగా ప్రభావం చూపేవారు. కానీ, ఈ సీజన్‌లో మాత్రం లెగ్ స్పిన్నర్లు, చైనామన్ స్పిన్నర్ల హవా కొనసాగుతుంది. ఐపీఎల్‌లో పెద్ద సంఖ్యలో యువ స్పిన్నర్లు రాణిస్తుండటం భారత క్రికెట్‌కు చక్కటి పరిణామం. అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని యువ ఆటగాళ్ళందరికీ అవకాశాలు లభిస్తున్నాయి' అని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications