For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెత్త వేసినందుకు జడేజాకు జరిమానా!

Former cricketer Ajay Jadeja fined for dumping garbage in Goa village

పనాజీ: నిర్లక్ష్యంగా రోడ్డుపై చెత్త పడేసినందుకు టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ అజేయ్ జడేజా రూ.5 వేల జరిమానా కట్టాడు. గోవాలో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసిన ఈ భారత మాజీ క్రికెటర్ అక్కడే నివసిస్తున్నారు. నార్త్ గోవాలోని అల్డోనా గ్రామంలో అతని ఇల్లు ఉంది. అయితే తన పక్కనే ఉన్న నచినోలా అనే గ్రామంలో జడేజా చెత్త పడేసి గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు తప్పును ఒప్పుకొని జరిమానా కట్టాడు. ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచ్ మీడియాకు​ వెల్లడించారు.

'కొందరు బయట వ్యక్తులు మా గ్రామంలో చెత్త వేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించడానికి కొందరు యువకుల్ని నియమించాం. వారు ఆ బ్యాగ్​లను పరిశీలించి ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే ఓ బ్యాగ్​పై అజయ్ జడేజా పేరుతో బిల్ పేపర్ గమనించాం. మరోసారి చెత్త వేయవద్దని హెచ్చరించాం. అతను తన తప్పును అంగీకరించి రూ. 5వేల జరిమానా కట్టాడు.

అతనిలాంటి పాపులర్ క్రికెటర్​ ఇక్కడ ఉంటుంనందుకు ఎంతో గర్వంగా ఉంది. అయితే ఎంతటి సెలబ్రిటీ అయినా పారిశుద్ధ్య నిబంధనలు పాటించాల్సిందే'అని సదరు గ్రామ సర్పంచ్ తృప్తి బండోద్కర్ చెప్పుకొచ్చారు. గోవాలోని అల్డోనా విలేజ్‌​ చాలామంది సెలబ్రిటీలకు సెకండ్ హోమ్​గా ఉంటోంది. జడేజా, అమితావ్ ఘోష్​తో పాటు మరికొందరు అక్కడే భవనాలు కొనుగోలు చేసి ప్రకృతిని ఆస్వాదిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.

భారత్ జట్టులోకి 1992లో అరంగేట్రం చేసిన అజయ్ జడేజా 15 టెస్టులు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 6 వన్డే సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన అజయ్ జడేజా.. 2000లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, June 29, 2021, 13:09 [IST]
Other articles published on Jun 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+