
బంతిని బాదేవాడు కావాలి..
2004లో భారత జట్టు స్పెషలైజ్‌డ్ వికెట్ కీపర్ లేని సమస్యను ఎదుర్కొందని, రాహుల్ ద్రవిడ్ వికెట్ కీపర్‌గా రాణిస్తున్నా.. అది అతనికి అదనపు భారమైందని, అప్పుడే తాము ధోనీని జట్టులోకి తీసుకొచ్చామని కిరణ్ మోరే గుర్తు చేసుకున్నాడు. అయితే ధోనీకి బదులుగా మా ముందు దినేశ్ కార్తీక్, పార్థీవ్ పటేల్ ఉన్నా.. భారీ హిట్టింగ్ చేయగల బ్యాట్స్‌మన్ కమ్ వికెట్ కీపర్ కోసం తాము అన్వేశించామన్నాడు. ఆ పరిస్థితుల్లో తమకు ధోనీ సరైనవాడిగా అనిపించాడని తెలిపాడు.

కంప్లీట్ ప్యాకెజ్ ధోనీలా..
‘రాహుల్ ద్రవిడ్ అప్పటికే 75 వన్డేలు కీపింగ్ చేశాడు. దాంతో మేం వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కోసం అన్వేశించాం. బంతిని బలంగా బాదే బ్యాట్స్‌మన్‌ను తీసుకొచ్చి రాహుల్‌పై భారాన్ని తగ్గించాలనుకున్నాం. ఆ పరిస్థితుల్లో మాకు ధోనీనే కంప్లీట్ ప్యాకెజ్‌లా కనిపించాడు. అతని గేమ్ అప్రోచ్ కూడా చాలా ప్రత్యేకంగా అనిపించింది. దాంతో ఇండియా ఏ తరఫున ఎంపిక చేసి కెన్యా పర్యటనకు పంపించాం. అక్కడ మహీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 600కు పైగా పరుగులు చేశాడు. మాకు అప్పటికే సెహ్వాగ్, యువరాజ్ వంటి భారీ హిట్టర్లున్నారు. కానీ ధోనీ రాకతో భారత్ టీమ్ సమతూకంగా అనిపించింది.'అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు.

గోల్డెన్ డకౌట్‌తో ప్రారంభించి..
సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004లో బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్ జర్నీ గోల్డెన్ డకౌట్‌తో మొదలైనా.. తర్వాత దేశ క్రికెట్ గతినే మార్చే స్థాయికి ఎదిగింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 17266 రన్స్ చేసిన 38 ఏళ్ల మహీఇప్పటిదాకా 350 వన్డేలు, 90 టెస్ట్‌లు, 98 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 829 ఔట్లలో పాలుపంచుకొని వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకడిగా ఇండియా బెస్ట్‌గా వెలుగొందాడు. ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహీ.. ఐపీఎల్ మాత్రం ఆడాడు. కాకపోతే గత వైభవాన్ని కొనసాగించలేకపోయాడు.

ధోనీని మిస్పవుతున్నాం..
మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా.. అతని గురించి చర్చలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. నిత్యం ధోనీ పేరు వార్తల్లో ఉంటుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20లోనూ ప్రత్యర్థి వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ సైతం మహీ మెరుపు వికెట్ కీపింగ్ నైపుణ్యాలను గుర్తు చేసుకున్నాడు. రెండో టీ20లోనూ ధోనీని ఎంతో మిస్ అవుతున్నామని భారత అభిమానులు ప్లకార్డులను ప్రదర్శించగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులతో తాను కూడా మిస్ అవుతున్నాని తెలియజేసేలా సైగలు చేశాడు.


Click it and Unblock the Notifications












