Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌కు జైలు శిక్ష!

చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో ఆస్ట్రేలియా మాజీ దేశవాళీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ ఆరోన్ సమ్మర్స్ (30) జైలు శిక్షకు గురయ్యాడు. 2018లో టాస్మేనియాలో జరిగిన ఒక ఘటనకు సంబంధించి తనపై నమోదైన నేరాలను కోర్టులో ఆరోన్ సమ్మర్స్ అంగీకరించాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెటర్‌లో టాస్మేనియా, హోబార్ట్ హరికేన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆరోన్ సమ్మర్స్.. ఈ లైంగిక వేధింపుల కేసుతో తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.

IND vs ENG: కోహ్లీ, రోహిత్‌ కూడా చేయలేనిది.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డ్!

IND vs ENG: కోహ్లీ, రోహిత్‌ కూడా చేయలేనిది.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డ్!

జూన్ చివరి వారంలో టాస్మేనియా కోర్టు విచారణ సందర్భంగా తన తప్పిదాన్ని ఆరోన్ సమ్మర్స్ ఒప్పుకున్నాడు. ఒక చిన్నారిని అసభ్యకర కంటెంట్ కోసం మభ్య పెట్టడంతో పాటు రెండు సార్లు లైంగికంగా వేధించినట్లు అంగీకరించాడు. హోబార్ట్ హరికేన్స్ జట్టుకు ఆడే సమయంలో సమ్మర్స్ ఈ ఘోరానికి ఒడిగట్టాడు.

Former Australian Cricketer Aaron Summers Faces Jail Time for Child Sexual Abuse

బాధితురాలితో ముందుగా సోషల్ మీడియా వేదికగా పరిచయం పెంచుకున్న సమ్మర్స్.. ఆపై ఈ నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. జైలు శిక్షను మినహాయించాలని సమ్మర్స్ తరఫు న్యాయవాది కారోలిన్ గ్రేవ్స్ కోర్టులో వాదించినా ఫలితం లేకపోయింది. తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైన సమ్మర్స్.. సోషల్ మీడియాకు బానిస అయ్యి ఈ నేరానికి పాల్పడ్డాడని గ్రేవ్స్ వాదించారు.

'ఆ రోజుల్లో సమ్మర్స్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా ఉన్నవాడు. కానీ ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ప్రస్తుతం సమ్మర్స్ ప్రవర్తన మారినందున జైలు శిక్ష నుంచి మినహాయించాలి.'అని గ్రేవ్స్‌ కోర్టును కోరారు. అయితే ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో జైలు శిక్ష నుంచి మినహాయించే అవకాశం స్పష్టం చేసింది.

IND vs ENG: వాటర్‌ బాయ్‌గానే వైభవ్.. రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ENG: వాటర్‌ బాయ్‌గానే వైభవ్.. రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

ఆరోన్ సమ్మర్స్‌ ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. చైల్డ్ అబ్యూస్ వస్తువులను కలిగి ఉండటం, ఇతరులకు షేర్ చేయడం వంటి కేసుల్లోనూ అతను దోషిగా తేలాడు. నార్తర్న్ టెరిటరీలో ఇప్పటికే జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. ప్రస్తుతం ఈ సరికొత్త కేసులో బెయిల్‌పై ఉన్న సమ్మర్స్‌ను కోర్టు ఆదేశాల మేరకు మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారు. ఆగస్టు నెలలో అతనికి ఎంతకాలం జైలు శిక్ష పడుతుందనే దానిపై కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.

Story first published: Friday, July 3, 2026, 12:33 [IST]
Other articles published on Jul 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+