న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రాడ్ హగ్ బెస్ట్ ఐపీఎల్ 2021 ఎలెవన్.. కోహ్లీ, రోహిత్‌కు నో చాన్స్.. కెప్టెన్‌గా రిషభ్ పంత్!

Former Australia cricketer Brad Hogg picks Best XI of IPL 2021
Best IPL 2021 XI నో కోహ్లీ, రోహిత్, ధోనీ Rishabh Pant Captain | ABD | Jadeja || Oneindia Telugu

సిడ్నీ: కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అత్యంత కఠినమైన బయో బబుల్ మధ్య 29 మ్యాచ్‌లు సజావుగా జరగాయి. కానీ బబుల్‌ను చీల్చుకొని వచ్చిన కరోనా వైరస్ వేగంగా ఆటగాళ్లకు వ్యాప్తి చెందింది. దాంతో బీసీసీఐ ఆటగాళ్ల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని నిరవధికంగా వాయిదా వేసింది. ఇక ఈ 29 మ్యాచ్‌ల్లోని ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఈ సీజన్ అత్యుత్తమ ఎలెవన్‌ను ఎంపిక చేశాడు. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలకు చోటు దక్కలేదు. ఈ సీజన్‌లో ఈ ముగ్గురు ఆటగాళ్లు అంతంత మాత్రమే రాణించడంతో బ్రాడ్ హగ్ నిర్మోహమాటంగా పక్కనపెట్టేసాడు.

ఓపెనర్లుగా షా, ధావన్..

ఓపెనర్లుగా షా, ధావన్..

ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్‌లను బ్రాడ్ హగ్ తన టీమ్ ఓపెనర్లుగా పేర్కొన్నాడు. ఇక ఈ ఇద్దరూ ఈ సీజన్‌లో దుమ్మురేపిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ 380 పరుగులతో రాణించగా.. పృథ్వీ షా 308 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ సూపర్ బ్యాటింగ్‌తో ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను బ్రాడ్ హగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో నిలకడైన ప్రదర్శన కనబర్చిన శాంసన్ ఓ సూపర్ సెంచరీతో 277 రన్స్ చేశాడు.

కెప్టెన్‌గా రిషభ్ పంత్..

కెప్టెన్‌గా రిషభ్ పంత్..

ఇక తన టీమ్ సారథిగా ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ రిషభ్ పంత్‌ను ప్రకటించాడు. ఈ సీజన్‌లోనే తొలి టీమ్ సారథ్య బాధ్యతలు చేపట్టిన పంత్.. టీమ్‌ను అద్భుతంగా నడిపించాడు. అతని సారథ్యంలోని ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 6 గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇక బ్యాటింగ్ పరంగా పంత్ 213 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విధ్వంసకర బ్యాట్స్‌మన్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ను తీసుకున్న బ్రాడ్ హగ్.. ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, సామ్ కరణ్‌లను తీసుకున్నాడు. డివిలియర్స్ ఆర్‌సీబీ తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా.. జడేజా, సామ్ కరణ్‌లు బ్యాట్, బంతితో మెరిసారు.

బౌలర్లుగా..

బౌలర్లుగా..

ఇక బౌలింగ్ కోటాలో పేసర్లుగా అవేశ్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రాలను తీసుకున్న బ్రాడ్ హగ్.. స్పిన్నర్ల కోటాలో రషీద్ ఖాన్, రాహుల్ చాహర్‌కు అవకాశం ఇచ్చాడు. అవేశ్ ఖాన్ సూపర్ బౌలింగ్‌తో ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ జట్టు ప్రధాన పేసర్ కగిసో రబడా కంటే అవేశ్ ఖాన్ మెరుగ్గా రాణించాడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా ఎప్పటిలానే తన మార్క్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ చిత్తుగా ఓడినా.. రషీద్ వ్యక్తిగతంగా రాణించాడు. రాహుల్ చాహర్ కూడా ముంబై తరఫున అదరగొట్టాడు. అయితే పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన హర్షల్ పటేల్‌ను బ్రాడ్ హగ్ తీసుకోకపోవడం గమనార్హం.

బ్రాడ్ హగ్ బెస్ట్ ఐపీఎల్ XI

బ్రాడ్ హగ్ బెస్ట్ ఐపీఎల్ XI

పృథ్వీ షా, శిఖర్ ధావన్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), ఏబీ డివిలియర్స్, రవీంద్ర జడేజా, సామ్ కరన్, రషీద్ ఖాన్, రాహుల్ చాహర్, ఆవేశ్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా

Story first published: Thursday, May 13, 2021, 22:16 [IST]
Other articles published on May 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X