పొట్టకూటి కోసం కార్పెంటర్‌గా మారిన వరల్డ్ కప్ విన్నింగ్ క్రికెటర్!

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, 2015 వరల్డ్ కప్ విజేత జేవియర్ డోహెర్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక కష్టాలు భరించలేక పొట్ట కూటి కోసం కార్పెంటర్‌గా మారాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన డోహెర్టీ 2001-02 సీజన్‌లో దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి.. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ అనంతరం ఆటకు గుడ్‌బై చెప్పాడు. మైకేల్ క్లార్క్ నేతృత్వంలో 2015 ప్రపంచకప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ జేవియర్ సభ్యుడు. ఆ మెగా టోర్నీలో ఏకైక మ్యాచ్ ఆడిన జేవియర్.. ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ తీయకుండా 60 రన్స్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు.
బతుకు తెరువు కోసం..
34 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జేవియర్.. బతుకు తెరువు కోసం కార్పెంటర్ వృత్తిని ఎంచుకున్నాడు. ఇక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జేవియర్‌కు సాయం చేసేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్ ముందుకొచ్చింది. కానీ దానికి అతను నిరాకరించాడు. తనకు ఎవరీ సాయం అక్కర్లేదని, కార్పెంటర్ పనిని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. తన పరిస్థితిని తెలుసుకొని ముందుకొచ్చిన ఆసీస్ క్రికెటర్ల సంఘానికి ధన్యవాదాలు తెలిపాడు. అతను మాట్లాడిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం ట్వీట్ చేసింది.

కార్పెంటర్ పనిలో కిక్ ఉంది..
'ఇప్పుడు నేను కార్పెంటర్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతీ రోజూ ఇలా సైట్స్‌కి వెళ్లి, పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నా. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. ఇది క్రికెట్‌కు పూర్తిగా భిన్నమైనది. నేను క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఏం చేయాలనే దానిపై క్లారిటీ లేకపోయింది. క్రికెట్‌కు దూరమైన తర్వాత ఏడాదిపాటు నాకు వచ్చిన ప్రతీ పనిని నేర్చుకోవడం మొదలెట్టాను. ల్యాండ్ స్కేపింగ్, ఆఫీస్ వర్క్స్, క్రికెట్ వర్క్.. ఇలా ఎన్నో పనులు చేశాను. కానీ కార్పెంటర్ పనిలోని నాకు కావాల్సిన మజా లభించింది. నాకు ఆర్థిక సాయం చేసేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం ముందుకొచ్చి. కానీ నాకు ఇప్పుడు ఎవరి సాయం అవసరం లేదు.'అని డోహెర్టీ తెలిపాడు.

రోడ్ సేఫ్టీ సిరీస్‌లో..
డోహెర్టీ తన కెరీర్‌లో ఆస్ట్రేలియా తరఫున 60 వన్డేలు, నాలుగు టెస్ట్‌లు ఆడి 55 వికెట్లు తీశాడు. చివరి సారిగా గతేడాది భారత్ వేదికగా జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆడాడు. ఆస్ట్రేలియా లెజెండ్స్ తరఫున బరిలోకి దిగాడు. కానీ కరోనా కారణంగా ఆ టోర్నీ వాయిదా పడగా.. ఈ ఏడాది పూర్తయింది. కానీ ఆస్ట్రేలియా లెజెండ్స్ టీమ్ పాల్గొనలేదు. దేశవాళీ క్రికెట్‌లో 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 176 లిస్ట్-ఏ, 74 టీ20 మ్యాచ్‌లు ఆడిన జేవీయర్ 415 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications