Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ డకౌట్ అయిన కోహ్లీ.. 17 ఏళ్లలో ఇదే తొలిసారి!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపర్చాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేల్లో కోహ్లీ పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు. గ్జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 8 బంతులాడిన కోహ్లీ.. తాజా మ్యాచ్‌లో 4 బంతులకే వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న కండిషన్స్‌పై ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తడబడ్డారు. ఆచితూచి ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. 7వ ఓవర్‌ తొలి బంతికి శుభ్‌మన్ గిల్(9)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన గ్జేవియర్ బార్ట్‌లెట్.. ఐదో బంతికి విరాట్ కోహ్లీని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో 17 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. కోహ్లీ డకౌట్ అయినా.. అడిలైడ్ అభిమానులు అతనికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. కోహ్లీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మైదానం వీడాడు.

For the First Time in His ODI Career Virat Kohli Dismissed for Consecutive Ducks

17 ఏళ్లలో ఇదే తొలిసారి..

ఇక తన 17 ఏళ్ల వన్డే క్రికెట్‌లోనే విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటవ్వడం ఇదే తొలిసారి. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటవ్వడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. 13 ఏళ్ల తర్వాత ఆసీస్‌పై తొలి సారి డకౌట్ అయిన కోహ్లీ.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సున్నాకే వెనుదిరిగాడు. ఇప్పటి వరకు 31 వన్డేలు ఆడిన కోహ్లీ.. గత రెండు మ్యాచ్‌ల్లోనే డకౌటయ్యాడు.

ఓవరాల్‌గా కోహ్లీకి ఇది 40వ డకౌట్. మూడు ఫార్మాట్లలో కలిసి 552 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 40 సార్లు పరుగుల ఖాతా తెరవకుండా వెనుదిరిగాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్(44)అగ్రస్థానంలో ఉండగా..ఇషాంత్ శర్మ(40)‌ను కోహ్లీ సమం చేశాడు. హర్భజన్ సింగ్(37), జస్‌ప్రీత్ బుమ్రా(35) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వన్డేల్లో కోహ్లీకి ఇది 18వ డక్‌ కాగా.. ఈ జాబితాలో అతను అనిల్ కుంబ్లే(18), యువరాజ్ సింగ్(18)‌లను సమం చేశాడు. సచిన్(20), జవగళ్ శ్రీనాథ్(19) టాప్-2లో కొనసాగుతున్నారు.

Story first published: Thursday, October 23, 2025, 10:03 [IST]
Other articles published on Oct 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+