Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Maharajas vs World Giants: పార్థీవ్ పటేల్ ఘోర తప్పిదం.. ప్రత్యర్థికి అప్పనంగా 5 పరుగులు!

Five runs penalty for India Maharajas as the ball touched Parthiv Patels helmet

కోల్‌కతా: లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ) 2022లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా మహరాజస్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ ఘోర తప్పిదం చేశాడు. అతని తప్పిదం కారణంగా ప్రత్యర్థి జట్టు వరల్డ్ జెయింట్స్‌కు అప్పనంగా 5 పరుగులు లభించాయి. వరల్డ్ జెయింట్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో అశోక్ దిండా వేసిన మూడో బంతిని పెరెరా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌ను మిస్సై కీపర్ చేతిలో పడింది. అయితే బంతి వేగాన్ని అంచనా వేయలేకపోయిన పార్థీవ్ పటేల్.. అందిపుచ్చుకోవడం విఫలమయ్యాడు. దాంతో చేజారిన బంతి.. మైదానంలో పెట్టిన పార్దీవ్ హెల్మెట్‌ను తాకింది. దాంతో అంపైర్ పెనాల్టీ కింద ఐదు పరుగులను ప్రత్యర్థి జట్టు స్కోర్‌కు జత చేసింది.

ఈ ఊహించని ఘటనకు పార్థివ్ పటేల్‌ నెత్తిని బాదుకోగా.. అశోక్ దిండా, కెప్టెన్ హర్భజన్ సింగ్ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వరల్ట్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెవిన్ ఓబ్రీన్(31 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. దినేశ్ రామ్‌దిన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) ధాటిగా ఆడాడు. ఇండియా మహరాజస్ బౌలర్లలో పంకజ్ సింగ్(5/26) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, మహహ్మద్ కైఫ్ తలో వికెట్ తీసారు. శ్రీశాంత్ మూడు ఓవర్లు వేసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా అతను వేసిన 19వ ఓవర్‌లో రామ్‌దిన్ ఐదు బౌండరీలతో 22 పరుగులు పిండుకున్నాడు.

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ల్లో భాగంగా ఈ ప్రత్యేక మ్యాచ్‌కు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఈ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్ జట్టుకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ నాయకత్వం వహిస్తాడని ప్రచారం జరిగినా.. అతను వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. దాంతో హర్భజన్ సింగ్ టీమ్‌ను నడిపిస్తున్నాడు. ఈ చారిటీ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బులను దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్‌కు చెందిన స్వచ్చంద సంస్థ ఖుషి ఫౌండేషన్‌కు అందజేయనున్నారు. 2003లో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రారంభించిన స్వచ్చంద సంస్థ ఖుషి ఫౌండేషన్.. దేశంలోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా పేద పిల్లలను స్కూళ్లకు పంపించడంలో ఖుషి ఫౌండేషన్ సక్సెస్ అయ్యింది. గత 17 ఏళ్లలో సుమారు 15 లక్షల పిల్లల జీవితాలను మార్చింది.

మహిళల సాధికారత కోసం ఈ మ్యాచ్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో మహిళా అంపైర్లు అంపైరింగ్ చేస్తున్నారు. మ్యాచ్ రిఫరీతో పాటు అంపైర్లు, టీవీ అంపైర్లు కూడా మహిళలే కావడం విశేషం. భారత్‌లో ఓ పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు మహిళా అంపైర్లు ఉండటం ఇదే తొలిసారి. లీగ్ మొత్తం మహిళలే అంపైరింగ్ చేయనున్నారు.

Story first published: Friday, September 16, 2022, 22:27 [IST]
Other articles published on Sep 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+