వాట్సన్ విధ్వంసం.. సెహ్వాగ్ చెడుగుడు.. ఐపీఎల్‌లో 5 బెస్ట్ నాకౌట్ ఇన్నింగ్స్‌లు ఇవే!!

హైద్రాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్. ప్రతి ఏడాదికి ప్రజాదరణ పెరుగుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌గా పరిగణించబడుతుంది. క్రికెటర్లు వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఐపీఎల్ అతిపెద్ద వేదిక. ఈ టోర్నమెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడుతుడడంతో క్రికెట్ అభిమానులు రెండు నెలల పాటు పండగ చేసుకుంటారు.
ఒక్కో జట్టు స్టార్లతో నిండిఉండడంతో ప్రతి మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది. ఇక ప్లేఆఫ్ కోసం అన్ని జట్లు పోటీపడుతాయి. అయితే ప్రతిసారి నాలుగు జట్లు మాత్రమే నాకౌట్స్ ఆడుతాయి. అయితే 12 సీజన్లలో బెస్ట్ నాకౌట్ ఇన్నింగ్స్‌లను ఓసారి గుర్తుచేసుకుందాం!!.

వాట్సన్ విధ్వంసం:
2018లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో షేన్ వాట్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన వాట్సన్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 2018 ఐపీఎల్ ఫైనల్లో పటిష్ట బౌలింగ్ లైనప్ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ చెన్నైకి 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వాట్సన్ మొదటి ఓవర్ను మెయిడిన్ చేశాడు. ఇక తన మొదటి 10 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆపై వాట్సన్ తన టైమింగ్‌ను అందుకున్నాడు. ప్రతి ఓవర్‌లో రెండు బౌండరీలు కొడుతూ.. 33 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ఆపై 51 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీంతో చెన్నై అద్భుత విజయం అందుకుంది.

ఏబీ మాయ:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఏబీ డివిలియర్స్ చాలా కాలంగా ఆడుతూ ఎన్నో విజయాలు అందించాడు. 2016లో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరిందంటే కారణం ఏబీ అద్భుత ప్రదర్శనే. 159 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగళూరు 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో స్టువర్ట్ బిన్నీ (21)తో ఏబీ ఉపయోగకరమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఇక 10 ఓవర్లు ముగిసే సమయానికి 68-6తో నిలిచింది. ఆపై ఇక్బాల్ అబ్దుల్లా (33)తో కలిసి అద్భుతంగా ఆడాడు. ఏబీ 41 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

మనీష్ ఊహించని ఇన్నింగ్స్:
2014 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున మనీష్ పాండే ఎవరూ ఊహించని ఇన్నింగ్స్ ఆడాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 200 పరుగుల భారీ టార్గెట్ ముందుంచింది. మొదటి ఓవర్లోనే రాబిన్ ఉతప్ప పెవిలియన్ చేరాడు. కెప్టెన్ గౌతమ్ గంభీర్ కూడా తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ దశలో యూసుఫ్ పఠాన్ (36) అండతో మనీష్ పాండే 50 బంతుల్లో 94 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా మరో మూడు బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది.

సెహ్వాగ్ చెడుగుడు:
వీరేందర్ సెహ్వాగ్ 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ మొదటి నుంచే అతడు విరుచుకుపడి పవర్‌ప్లే ముగిసే సమయానికి 18 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అశ్విన్, జడేజా, నెహ్రాలకు చూపించాడు. 58 బంతుల్లో 122 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో 22 పరుగులను పంజాబ్ ఆటగాళ్లు బాదారు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ తన అద్భుత ప్రదర్శనతో 2009లో డెక్కన్ ఛార్జర్స్ జట్టును సెమీ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో 154 పరుగుల ఛేదన కష్టమనుకున్నారు. గిల్‌క్రిస్ట్ మాత్రం మొదటి ఓవర్లోనే వరుసగా ఐదు బౌండరీలు బాది మంచి శుభారంభం ఇచ్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికి జట్టు 102 పరుగులు చేయగా.. గిల్‌క్రిస్ట్ చేసినవి 85 రన్స్ ఉన్నాయి. ఈ ఐదు ఇన్నింగ్స్ ఐపీఎల్‌లో బెస్ట్ అని చెప్పొచ్చు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. విన్నింగ్ జట్టుతోనే బరిలోకి ఇంగ్లండ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications