Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి దరిద్రం రా అయ్యా.. క్రికెట్ చరిత్రలోనే కని వినీ ఎరుగని రనౌట్!(వీడియో)

క్రికెట్ చరిత్రలోనే కని వీని ఎరుగని ఓ రనౌట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ లోకల్ టెన్నిస్ బాల్ టోర్నీలో చోటు చేసుకున్న ఈ ఘటన క్రికెట్ అభిమానులకు నవ్వులు తెప్పిస్తుంది. ఇలా కూడా రనౌట్ అవుతారా? అనే సందేహం కలిగిస్తోంది. ఔటైన బ్యాటర్ దరిద్రం మాములుగా లేదనే అభిప్రాయం కలుగుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్‌ఛల్ చేస్తుండగా.. మరో 100 ఏళ్లు అయినా ఇలాంటి రనౌట్ చూడమని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే..?

ఓ లోకల్ టెన్నిస్ బాల్ టోర్నీలో బ్యాటర్ ఫార్వార్డ్ షార్ట్ లెగ్ ఫీల్డర్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న ఫీల్డర్.. వేగంగా వికెట్ కీపర్ వైపు విసిరాడు. ఆ బంతి ఎత్తులో వెళ్లడంతో వికెట్ కీపర్ జంప్ చేసి అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతని గ్లోవ్స్‌కు తాకిన బంతి నిదానంగా నాన్‌స్ట్రైకర్ వైపు వచ్చింది. మరోవైపు వికెట్ కీపర్ కిందపడిపోగా.. ఇద్దరు బ్యాటర్లు పరుగు పూర్తి చేశారు. నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న బ్యాటర్ బంతిని చూసుకోకుండా క్రీజును దాటాడు. కీపర్ గ్లోవ్స్‌కు తాకి నిదానంగా వచ్చిన బంతి బ్యాటర్ కాళ్ల మధ్యలో నుంచి వెళ్లి నాన్ స్ట్రైకర్ వికెట్లను తాకింది.

First Time in Cricket History Bizarre Run Out Leaves Cricket Fans in Splits Video Goes Viral

దాంతో బెయిల్స్ కిందపడగా.. ఫీల్డింగ్ టీమ్ అప్పీల్ చేసింది. దాంతో బ్యాటర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో మైదానంలో నవ్వులు పూయగా.. సదరు బ్యాటర్ బిత్తర చూపులు చూసుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. ఈ వీడియోను పాపులర్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో పేరిట ఎక్స్ అకౌంట్ నడిపిస్తున్న ఓ నెటిజన్ షేర్ చేశాడు. వాస్తవానికి ఈ ఎక్స్‌ అకౌంట్ రిచర్డ్ కెటిల్‌బరోదేనని అంతా అనుకుంటారు. కానీ అది అతనిది కాదు.

భారత్‌కు దరిద్రపు అంపైర్

అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో గురించి తెలియని భారత క్రికెట్ అభిమాని ఉండరు. అతను అంపైరింగ్ చేసిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమిపాలైంది. దాంతో అతన్ని దరిద్రపుగొట్టు అంపైర్ అని భారత అభిమానులు పిలుస్తారు. సదరు అంపైర్‌కు భారత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన ఓ నెటిజన్ అతని పేరిట ఎక్స్‌ అకౌంట్ తెరిచి బ్లూ టిక్ సాయంతో క్రికెట్‌కు సంబంధించిన పోస్ట్‌లు పెడుతున్నాడు. ఇలాంటి ఫన్నీ వీడియోలు షేర్ చేస్తుండటంతో ఈ అకౌంట్ క్రికెట్ సర్కిల్‌లో పాపులర్ అయ్యింది. ఈ అకౌంట్‌ను లక్ష మందికి పైగా ఫాలో అవుతున్నారు.

Story first published: Friday, August 15, 2025, 12:25 [IST]
Other articles published on Aug 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+