చిక్కుల్లో టీమిండియా మాజీ క్రికెటర్.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు! చహల్ కారణంగానే!

చంఢీగఢ్: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. గతేడాది ప్రత్యేకించి ఓ సామాజిక వర్గం పేరుతో చేసిన వ్యాఖ్యలపై హరియాణా పోలీసులు ఆదివారం యువరాజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఓ లాయర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిసార్‌లోని హాన్సీ పోలీస్ స్టేషన్‌లో యువరాజ్‌పై కేసు నమోదైంది. అనంతరం పోలీసులు ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 295, 505తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని 3(1)(ఆర్), 3(1)(ఎస్) కింద ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపామని, సాక్ష్యాలున్నాయని నిర్దారించుకుని కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఇంతకీ ఏమైందంటే?

చహల్‌ను ఉద్దేశించి
గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా క్రీడలు అన్ని నిలిచిపోయాయి. ఆ సమయంలో క్రికెటర్లు లైవ్ షోల ద్వారా అభిమానులతో పలుకరించారు. ఈ క్రమంలో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి యువరాజ్ సింగ్ ఇన్‌స్టా లైవ్ సెషన్ నిర్వహించారు. వీరి లైవ్ సెషన్ మధ్యలో దూరి కామెంట్ చేసిన టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను ఉద్దేశించి ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు సరదాగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా యూజీ టిక్ టాక్ వీడియోల గురించి ప్రస్తావించారు. 'ఈ బాంగీ మనషుల్లా యూజీకి పనిపాట లేనట్లుంది. అతని కుటుంబంతో చేసిన వీడియోలు చూశావా?' అని రోహిత్‌ను యువీ ప్రశ్నించారు.

క్షమించాలని కోరిన యువీ
అయితే దళిత వర్గానికి చెందిన ఓ కులాన్ని హిందీలో 'బాంగీ' అని పిలుస్తారని, ముఖ్యంగా వీధుల ఊడ్చే వారిని, దిగువ స్థాయి కులాలకు చెందిన వారిని ఇలా పిలుస్తారని, అలాంటి పదాన్ని ఉపయోగించిన యువరాజ్ సింగ్ వారిని కించపరిచాడని నెటిజన్లను ఆరోపించారు. అనంతరం యువీ అప్పట్లో ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. తాను ఎవర్నీ కావాలని కించపరిచే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా చేయని వ్యాఖ్యల కారణంగా ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే క్షమించాలని కూడా కోరారు.

విచారణ జరిపి
అయితే యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని, దిగువ స్థాయి కులాలను లక్ష్యం చేసుకుంటూ ఆయన మాట్లాడారంటూ హిసార్‌కు చెందిన ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై లాక్‌డౌన్ అనంతరం విచారణ జరిపి, వీడియో ఫుటేజీలను పరిశీలించిన హిస్సార్ పోలీసులు యువీపై కేసును నమోదు చేశారు. త్వరలోనే యువరాజ్‌కు నోటీసులు పంపి ఆయన్ను విచారిస్తామని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.

ప్రపంచకప్‌లు గెలవడంలో కీలక పాత్ర:
2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు టీమిండియా గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రెండు మెగా టోర్నీల్లోను 'టోర్నీ ఆఫ్ ది సిరీస్'గా నిలిచారు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యూవీ ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించారు. 2011 ప్రపంచకప్ తర్వాత కాన్సర్ బారీన పడిన యూవీ.. లండన్‌కు వెళ్లి శస్త్ర చికిత్స తీసుకొని టీమిండియా తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడినా మునుపటి ప్రదర్శనను చూపించలేకపోయారు. యువీ భారత్ తరఫున 40 టెస్టులు, 301 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.
India vs England: లంచ్ బ్రేక్.. 6 వికెట్లు కోల్పోయిన భారత్! ఆధిక్యం ఎంతంటే?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications