IPL 2026: ఫిన్ అలెన్ విధ్వంసం.. గుజరాత్‌కు తప్పని పరాజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా 5 విజయాల తర్వాత ఓటమిని చవిచూసింది. శనివారం కోల్‌కతా వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 29 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. గుజరాత్ టైటాన్స్ టాప్-2లోనే కొనసాగుతోంది. ఫిన్ అలెన్ విధ్వంసంతో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించగా.. చెత్త ఫీల్డింగ్‌తో నాలుగు క్యాచ్‌లు వదిలేసి గుజరాత్ టైటాన్స్ మూల్యం చెల్లించుకుంది.
ఫిన్ అలెన్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 2 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫిన్ అలెన్(35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 93) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. అంగ్‌క్రిష్ రఘు వంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82 నాటౌట్), కామెరూన్ గ్రీన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసారు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులే చేసి ఓటమిపాలైంది. శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85), జోస్ బట్లర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), సాయి సుదర్శన్(28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్(2/29) రెండు వికెట్లు తీయగా.. సౌరభ్ దూబే, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ పడగొట్టాడు.
కొంపముంచిన చెత్త ఫీల్డింగ్..
గుజరాత్ టైటాన్స్ ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేసి మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా డేంజరస్ ప్లేయర్ ఫిన్ అలెన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఆరంభంలోనే వదిలేసారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను జాసన్ హోల్డర్ ఎక్స్‌ట్రా కవర్స్‌లో వదిలేసాడు. 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ ఇచ్చిన మరో క్యాచ్‌ను మహమ్మద్ సిరాజ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాలతో ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 10 సిక్సర్లతో గుజరాత్ పతనాన్ని శాసించాడు.
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కామెరూన్ గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్‌లో అర్షద్ ఖాన్ అందుకోలేకపోయాడు. ఈ అవకాశంతో గ్రీన్ 23 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే అంగ్‌క్రిష్ రఘువంశీ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ వదిలేసాడు. దాంతో అతను మరింత దూకుడుగా ఆడి 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.
గేమ్ ఛేజింగ్ మూమెంట్..
కామెరూన్ గ్రీన్, రఘువంశీ మూడో వికెట్‌కు అజేయంగా నెలకొల్పిన 109 పరుగుల భాగస్వామ్యం గేమ్ ఛేజింగ్ మూమెంటమ్‌గా నిలిచింది. ఈ ఇద్దరి భాగస్వామ్యంతోనే కేకేఆర్ ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. బౌలింగ్‌లో సునీల్ నరైన్.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

" width="200" height="113">