Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ క్యాచ్‌లు వదిలేయడంతోనే ఈ భారీ ఇన్నింగ్స్: ఫిన్ అలెన్

అదృష్టవశాత్తు ఇన్నింగ్స్ ఆరంభంలో తన క్యాచ్‌లు వదిలేయడం కలిసొచ్చిందని కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ ఫిన్ అలెన్ అన్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో చెలరేగానని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిన్ అలెన్(35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్ల‌తో 93) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.

అతనికి తోడుగా అంగ్‌క్రిష్ రఘు వంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82 నాటౌట్), కామెరూన్ గ్రీన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 2 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే కేకేఆర్‌కు ఇది రికార్డ్ స్కోర్.

లక్ కలిసి రావడంతో..

కేకేఆర్ ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన ఫిన్ అలెన్.. లక్ కలిసి రావడంతోనే భారీ ఇన్నింగ్స్ ఆడగలిగానని చెప్పాడు. 'ఇన్నింగ్స్ ఆరంభంలో నాకు అదృష్టం కలిసి వచ్చింది. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాను. బ్యాటింగ్ చేయడానికి ఇది అద్భుతమైన మైదానం. బౌండరీలు చాలా చిన్నవి. సాధారణంగా పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

Finn Allen Says Got a Bit Lucky Early On Wicket Got Better as the Innings Progressed on KKR s Record Total
Photo Credit: screen grab for JioHotstar

అయితే మ్యాచ్ ఆరంభంలో పిచ్ కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ మేం ఆ దశను అధిగమించే ప్రయత్నం చేశాం. ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు మెరుగ్గా మారింది. కొత్త బంతితో ఆడటం సవాలుగా అనిపించింది. పైగా ఇద్దరు నాణ్యమైన బౌలర్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో ఆచితూచి ఆడి మిడిల్ ఓవర్ల వరకు క్రీజులో ఉండే ప్రయత్నం చేశాను.

అతను అద్భుతమైన ఆటగాడు..

రఘువంశీ అద్భుతమైన ఆటగాడు. అతను బ్యాటింగ్ చేసిన విధానం.. ఇంత చిన్న వయసులో చూపిస్తున్న నైపుణ్యం అమోఘం. అతను ఒక నాణ్యమైన ప్లేయర్. మా లక్ష్యం గురించి నేను ఆలోచించలేదు. క్రీజులో ఉండి జట్టుకు కావాల్సిన పరుగులు అందించాలనుకున్నాను. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో ఎక్కవగా ఆలోచించకుండా స్పష్టమైన అవగాహనతో ఆడాను. 'అని ఫిన్ అలెన్ చెప్పుకొచ్చాడు.

14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను జాసన్ హోల్డర్ ఎక్స్‌ట్రా కవర్స్‌లో వదిలేసాడు. 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ ఇచ్చిన మరో క్యాచ్‌ను మహమ్మద్ సిరాజ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాలతో ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మొత్తం 4 క్యాచ్‌లు వదిలేసి మూల్యం చెల్లించుకుంది.

Story first published: Saturday, May 16, 2026, 22:46 [IST]
Other articles published on May 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+