For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్- అనుష్క కూతురు ‘వామికా’ పేరులోని అర్థం ఏంటో తెలుసా?

Find out meanings behind Anushka Sharma-Virat Kohlis daughter Vamika name

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు ఇటీవలే ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తమ కూతురుకు సంబంధించిన విషయాలను చాలా ప్రైవసీగా ఉంచాలని భావించిన ఈ స్టార్ కపుల్ జోడీ.. ఇప్పటి వరకు తమ గారాల పట్టీ ఫొటోను అభిమానులతో పంచుకోలేదు. ఈ నేపథ్యంలోనే తమ కూతరు ఫొటోలను అనుమతి లేకుండా తీయవద్దని ఫొటోగ్రాఫర్లందరని విరుష్కా జోడీ విజ్ఞప్తి చేసింది. అయితే సోమవారం ఎట్టకేలకు తమ కూతురి పేరు‌ 'వామికా'అని విరుష్కా జోడీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తమ గారాల పట్టీ ముఖం కనిపించకుండా ఉన్న ఫొటోను కూడా అభిమానులతో పంచుకుంది.

వామికా అంటే దుర్గామాత..

వామికా అంటే దుర్గామాత..

అయితే విరుష్కా జోడీ తమ కూతురి పేరు ప్రకటించాక 'వామికా' పేరు అర్థం తెలుసుకోవడం కోసం వారి అభిమానులంతా గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. దాంతో ఈ నేమ్ ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే వామికా అంటే దుర్గామాతకు మరో పేరని పండితులు పేర్కొంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొన్న కథనం ప్రకారం శివుడి అర్థనారీశ్వరుడి రూపాన్ని కూడా వామికా అని పిలుస్తారంట. ఇక విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసొచ్చేలా 'వామికా' అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

మా సంతోషాన్ని రెట్టింపు చేసింది..

మా సంతోషాన్ని రెట్టింపు చేసింది..

వామికా తమ సంతోషాన్ని రెట్టింపు చేసిందని అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'మేము ఎంతో ప్రేమ, అనురాగం, ఆప్యాయలతో నిండిన జీవితాన్ని గడిపాం. వామికా ఆ సంతోషాలను మరింత రెట్టింపు చేసింది. తన రాక ఎన్నో వెలుగులను తీసుకొచ్చింది. ఆనందం, కన్నీళ్లు, ఆందోళన.. ఇలా నిమిషాల వ్యవధిలోనే ఎన్నో భావోద్వేగాలు. కానీ మా హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆప్యాయతలకు ధన్యవాదాలు' అని అనుష్క శర్మ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో రాసుకొచ్చారు.

 జనవరి 11న జననం..

జనవరి 11న జననం..

అనుష్క శర్మ జనవరి 11న వామికాకు జన్మనిచ్చింది. అయితే తమ చిన్నారి గోప్యతకు భంగం కలగకుండా తనను సంరక్షించుకోవాలని భావిస్తున్నామని, తమ కుమార్తె ఫొటోలు తీయవద్దని విరుష్క దంపతులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో విరుష్క జోడీ కూతురు ఎలా ఉంటుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం అనుష్క తమ చిన్నారి ఫోటో షేర్‌ చేసినా.. అందులో ఆమె రూపం కనిపించడం లేదు.

క్వారంటైన్‌లో కోహ్లీ

క్వారంటైన్‌లో కోహ్లీ

ఓ షాంపు యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. ఐదారేళ్లు ప్రేమాయణంలో మునిగి తేలారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో గడిపిన ఈ స్టార్ సెలెబ్రిటీలు.. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. అనుష్క శర్మ ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకు విరాట్ కోహ్లీ పెటర్నటీ లీవ్‌పై ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేశాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్టు ఆరంభంకానుంది. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే అనుష్కా కూడా విరాట్‌తోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Monday, February 1, 2021, 15:11 [IST]
Other articles published on Feb 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+