FIFA World Cupలో రచ్చ: ఓటమి భారంతో అర్జెంటీనా ఆటగాడిపై ఇంగ్లాండ్ స్టార్ దాడి! (వీడియో)
ఫిఫా వరల్డ్ కప్ 2026 రెండో సెమీ-ఫైనల్లో ఓ అద్భుతమైన ఫుట్ బాల్ మ్యాచ్‌కు బదులుగా ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లీగ్ దశ నుంచి అద్భుతంగా ఆడుతూ సెమీస్ వరకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు.. సెమీస్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా చేతిలో 2-1 తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య నెలకొన్న గందరగోళం, ఘర్షణ వాతావరణం క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేలా కనిపించింది. ఇంగ్లాండ్ స్టార్ మిడ్ ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ ప్రవర్తన ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది.
ఇంగ్లాండ్ ఓటమి అనంతరం అర్జెంటీనా జట్టు తమ విజయోత్సవాలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ స్టార్ మిడ్ ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ అర్జెంటీనా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు వాలెంటినో బార్కో తల వెనుక భాగంలో కొడుతున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఆ దెబ్బ తర్వాత బెల్లింగ్‌హామ్, బార్కోల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. తోటి ఆటగాళ్లు అడ్డుకుని వారిద్దరిని పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. ఆసక్తికరంగా ఈ సంఘటన మ్యాచ్ అధికారుల దృష్టికి రాలేదు. అందువల్ల మైదానంలో బెల్లింగ్‌హామ్‌పై తక్షణ చర్య ఏదీ తీసుకోలేదు. అయితే ఈ సంఘటన వీడియోలో రికార్డ్ అయినందున ఫిఫా ఇప్పుడు క్రమశిక్షణా చర్యల అంశాన్ని లేవనెత్తింది. ఫిఫా ఈ విషయాన్ని సమీక్షించే అవకాశం ఉంది. ఒకవేళ ఫిఫా దీనిని తీవ్రమైనదిగా భావిస్తే బెల్లింగ్‌హామ్‌కు జరిమానా లేదా ఒక మ్యాచ్ నుంచి నిషేధం విధించే అవకాసం ఉంది.

ఇలా జరిగితే శనివారం ఫ్రాన్స్‌తో జరిగే మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌కు జూడ్ బెల్లింగ్‌హామ్ దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ఫిఫా ప్రస్తుతం ఈ సంఘటనను హెచ్చరిక లేదా జరిమానాకు పరిమితం చేస్తుందని భావిస్తున్నారు. ఈ విషయంపై ఫిఫా నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఓటమి తర్వాత బెల్లింగ్‌హామ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చివరి విజిల్ మోగినప్పుడు అతను మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అతను యువ ఆటగాడు నికో ఓ'రైలీని ఓదార్చాడు, కానీ కొద్దిసేపటికే తన సహచర ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ ఆటగాడు మోర్గాన్ రోడ్జర్స్, అర్జెంటీనా ఆటగాళ్ల మధ్య ఘర్షణ చెలరేగడంతో మరో పెద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సెంటర్ సర్కిల్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు ఎదుర్కోవడంతో, అక్కడి వాతావరణం బాగా ఉద్రిక్తంగా మారింది.
హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చెక్? భారత కెప్టెన్సీపై స్మృతి మంధాన ఓపెన్ టాక్!
ఇంగ్లండ్ రిజర్వ్ గోల్ కీపర్ డీన్ హెండర్సన్ ఆటగాళ్లను శాంతపరచడానికి ప్రయత్నించాడు. జేమ్స్ ట్రాఫోర్డ్, ఇవాన్ టోనీ కూడా జోక్యం చేసుకున్నారు. అర్జెంటీనా డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్‌కు రోడ్జర్స్‌ను దూరంగా ఉంచారు. అయినప్పటికీ రోడ్జర్స్ అర్జెంటీనా బ్యాకప్ గోల్ కీపర్ జువాన్ ముస్సోతో కూడా తీవ్ర వాగ్వాదానికి దిగాడు. మరోవైపు ఇంగ్లండ్‌కు చెందిన డాన్ బర్న్‌ను అర్జెంటీనాకు చెందిన ఎంజో ఫెర్నాండెజ్, క్రిస్టియన్ రొమెరో చుట్టుముట్టగా.. ఇవాన్ టోనీ అర్జెంటీనాకు చెందిన గొంజలో మాంటియెల్‌ను శాంతపరచడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు.మైదానంలోని ఈ ఉత్కంఠ మ్యాచ్‌కు తుది ఘట్టంగా నిలిచింది. ఇందులో అర్జెంటీనా చివరి నిమిషాల్లో చేసిన రెండు గోల్స్‌తో ఇంగ్లాండ్‌ను 2-1 తేడాతో ఓడించి, వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
