Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి ఫీల్డింగ్ రా అయ్యా.. నేను ఏడా చూడలే!(వీడియో)

యూరోపియన్ టీ10 క్రికెట్ టోర్నీలో చోటు చేసుకున్న ఓ ఘటన నవ్వులు పూయిస్తోంది. బౌండరీ ఆపేందుకు ఓ ఫీల్డర్ చేసిన విన్యాసం అందర్నీ ఆకట్టుకుంది. కష్టపడి ఫోర్ వెళ్లకుండా బంతిని ఆపిన అతను.. అదుపు తప్పి చేసిన తప్పిదం వైరల్‌గా మారింది. సదరు ఫీల్డర్ చేసిన విన్యాసానికి అంపైర్లతో పాటు సహచర ఆటగాళ్లు, ప్రత్యర్థి బ్యాటర్లు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.

ఈ విచిత్రకర ఘటన యూరోపియన్ క్రికెట్ టో‌ర్నీ‌లో భాగంగా ఇండిపెండెట్స్ సీసీ వర్సెస్ డోనో‌స్టాడ్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది.

Fielding blunder in European Cricket video goes Viral

148 పరుగుల లక్ష్యచేధనకుఇండిపెండెట్స్ సీసీ టీమ్ బరిలోకి దిగగా.. బౌలర్ వేసిన ఓ బంతిని డోన్‌స్టాడ్ వికెట్ కీపర్‌గా అందుకోలేకపోయాడు. దాంతో బంతి థర్డ్ మ్యాన్ వైపు బౌండరీ దిశగా దూసుకెళ్లింది. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ వేగంగా పరుగెత్తి కాలు సాయంతో బంతి బౌండరీ రోప్‌ను తాకకుండా అడ్డుకున్నాడు.

ఆ వేగంలో సమన్వయం కోల్పోయిన అతను బౌండరీ సైన్ బోర్డు మీదుగా బయటకు దూసుకెళ్లాడు. అనంతరం మళ్లీ మైదానంలోకి తిరిగొచ్చి.. అంతే వేగంతో బంతిని అందించే ప్రయత్నంలో ఘోర తప్పిదం చేశాడు. బంతిని వేగంగా తీసుకునే క్రమంలో అతని చేయి జారిని బంతి బౌండరీ లైన్ బయటపడింది.

దాంతో సదరు ఫీల్డర్ ప్రయత్నం వృథా అయ్యింది. ఈ ఘటన పట్ల అతను తీవ్ర నిరాశకు గురవ్వగా.. మిగతా ఆటగాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో డోనో‌స్టాడ్ 14 పరుగుల తేడాతో ఇండిపెండెంట్ సీసీపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డోన్‌స్టాడ్ నిర్ణీత 10 ఓవర్లలో 147 పరుగులు చేసింది. రాజ్మల్ షిగివాల్ (20 బంతుల్లో 3 సిక్సర్లతో 43), బసీర్ ఖాన్(70) రాణించారు. అనంతరం ఇండిపెండెంట్ సీసీ జట్టు 133 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు తరఫున టామ్ చీటర్( 29 బంతుల్లో 6 సిక్సర్లతో 67) ఒక్కడే రాణించాడు.

Story first published: Saturday, March 16, 2024, 14:03 [IST]
Other articles published on Mar 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+