Vaibhav Sooryavanshi: బుడ్డోడా.. ఏం గుండెరా నీది! బుమ్రా బౌలింగ్‌లోనే సిక్సర్లా..?(వీడియో)
టీమిండియా టీనేజ్ సెన్సేషన్, రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ పిడుగు వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. వరల్డ్ బెస్ట్ పేసర్‌ను ఎదుర్కొంటున్నాననే బెరుకు లేకుండా.. తొలి బంతినే సిక్సర్ కొట్టాడు. 15 ఏళ్ల వైభవ్ సిక్సర్‌కు బుమ్రా నోరెళ్ల బెట్టాడు. ఆ తర్వాత మరో సిక్సర్ బాదిన వైభవ్.. 3 బంతుల వ్యవధిలోనే 2 సిక్స్‌లు బాది బుమ్రాకు దిమ్మతిరిగే షాకిచ్చాడు.
ఈ రెండు భారీ సిక్స్‌లతో బుమ్రా నవ్వుతూ.. సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రస్తుతం ఈ సిక్స్‌లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు వైభవ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'బుడ్డోడా.. ఏం గుండెరా నీది! బుమ్రా బౌలింగ్‌లోనే సిక్సర్లా..?'అని కొనియాడుతున్నారు. బుమ్రాకే షాకిచ్చిన బుడ్డోడు అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

6 బంతుల్లో 5 బౌండరీలు..
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గౌహతి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ దాదాపు 3 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. పవర్ ప్లే ఆట 3.2 ఓవర్లుగా నిర్ణయించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లో యశస్వి జైస్వాల్(4, 6, 4, 0, 4, 4) నాలుగు బౌండరీలు, ఒక సిక్స్ బాది 22 పరుగులు పిండుకున్నారు.
ఫస్ట్ బాల్‌కే సిక్సర్..!
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన రెండో ఓవర్ తొలి బంతినే వైభవ్ సూర్యవంశీ లాంగాన్ దిశగా సిక్సర్ తరలించాడు. అనంతరం సింగిల్ తీసుకోగా.. జైస్వాల్ మరో సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతిని కూడా లెగ్ సైడ్ సిక్సర్ బాదిన వైభవ్ సూర్యవంశీ.. తర్వాతి రెండు బాల్స్ డాట్ చేశాడు.
ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మరో సిక్సర్ బాదిన బుడ్డోడు.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో మరో రెండు సిక్స్‌లు కొట్టి మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అతను కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్‌పై తిలక్ వర్మ అద్భుతంగా అందుకున్నాడు. 14 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో సునామీలా విరుచుకుపడిన వైభవ్ సూర్యవంశీ 39 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications